
ఈ క్రమంలోనే ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో వంటి సినిమాలతో లోకేష్ తన రేంజ్ ను అమాంతం పెంచుకున్నారు. దీంతో ఇప్పుడు ఈయనతో సినిమా చేయాలని ప్రతి ఒక్క హీరో కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ కనగరాజు రజనీకాంత్ తో కూలీ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అటు ఖైదీ 2తో పాటు విక్రమ్ 2 , లియో 2 సినిమాలు కూడా ప్లాన్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే ముందుగా ఖైదీ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు లోకేష్.
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన ఖైదీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ ఖైదీ 2 రాబోతోంది.. ఇప్పటికే సూర్య ఈ చిత్రంలో రోలెక్స్ పాత్రతో సందడి చేయగా.. ఇప్పుడు ఈ ప్రాజెక్టు గురించి మరో విషయం నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే కమలహాసన్ అతిధి పాత్రలో కనిపించనున్నారట.అంతేకాదు ఈ సినిమా క్లైమాక్స్ విక్రమ్ 2 కి లీడ్ ఇచ్చేలా ఉంటుందని, దానికి హీరో విజయ్ తో వాయిస్ ఓవర్ ఇప్పించనున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే వీటన్నింటికీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే సినిమా బ్లాక్ బస్టర్ అనడంలో సందేహం లేదని నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.