
8 వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలతో తీసుకుపోతున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అనిల్ రావిపూడి చిరంజీవితో సినిమా చేస్తూ పెద్ద రిస్క్ చేస్తున్నాడా అన్న చర్చలు టాలీవుడ్ వర్గాలలో వినిపిస్తున్నాయి. చిరంజీవి ఈ సినిమా కోసం తన రెమ్యూనరేషన్ ఏకంగా 75 కోట్లకు పెంచినట్లు తెలుస్తోంది. దీనికి తోడు బ్యానర్ ఇచ్చినందుకు కుమార్తెకు 10 కోట్లు అదనంగా ఇస్తున్నారట. అంటే మొత్తం 85 కోట్లు చిరంజీవి ఖాతాలోకి వెళుతున్నాయి. అనిల్ రావిపూడి రెమినరేషన్ ఎలా లేదన్న 25 నుంచి 30 కోట్లు ఉంటుంది. పైగా సంక్రాంతికి వస్తున్న 300 కోట్లు సాధించింది. ఆయన అడిగినంత ఇవ్వటంలో తప్పులేదు. వీరిద్దరూ పారితోష కాలకే దాదాపు 120 కోట్లు అయ్యాయి.
మిగిలిన పారితోషకాలు .. మేకింగ్ .. పబ్లిసిటీ దానిపై వడ్డీలు ఇవన్నీ కలుపుకుంటే మరో 100 కోట్లు ఈజీగా అవుతాయి. ఈ సినిమా బడ్జెట్ పేపర్ మీద 220 కోట్లు కనిపిస్తోంది. మరో 10 నుంచి 20 కోట్లు అదనంగా అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంటే 220 కోట్లు పెట్టి సినిమా తీస్తే రిటర్న్ ఎంత రావాలి ? బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎంత వసూలు చేయాలి ? చిరంజీవి సినిమా కదా డబ్బులు ఎలాగైనా రాబట్టుకోవచ్చు అన్న ధీమా ఇప్పుడు లేదు. సినిమా అటు ఇటు అయితే ఎంత గొప్ప స్టార్ హీరో ఉన్న ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆచార్య - సైరా - భోళాశంకర్ ఫలితాలే అందుకు నిదర్శనం.
నాన్ థియేటర్ రైట్స్ ఉన్నాయన్న ధీమా కూడా లేదు. ఎందుకంటే విశ్వంభర సినిమా ఓటీటీ ఇప్పటికీ అమ్మ లేదు. ఈ సినిమాకు 50 కోట్లు వస్తాయని అనుకుంటే ఓటిటీ సంస్థలు 25 కోట్లకు మించి పైసా ఇవ్వం అని చెబుతున్నాయి. ఎంత అనిల్ రావిపూడి సినిమా అయినా 40 కోట్లకు మించి ఎక్కువ ఎవరని అంటున్నారు సంక్రాంతికి వస్తున్నాం 300 కోట్లు సాధించింది అని లెక్కలేసుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈ సినిమా రెమ్యూనరేషన్లు సినిమా షూటింగ్ అన్నీ కలిపి 30 కోట్ల లోపు అయింది. కేవలం 70 రోజుల్లో పూర్తి చేశారు. ఏది ఏమైనా విశ్వంభర సినిమా జాతకం కూడా ఈ ప్రాజెక్టుని డిసైడ్ చేస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. అనిల్ రావిపూడి అనవసరంగా చిరంజీవితో పెద్ద ప్రాజెక్ట్ చేస్తూ పెద్ద రిస్క్ చేస్తున్నాడు.. అన్న చర్చలు టాలీవుడ్ వర్గాలలో వినిపిస్తున్నాయి.