![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/daku-maharaj-de72a2e9-8e5d-4509-92e9-9ba2f81bf6cf-415x250.jpg)
ఈ సంక్రాంతికి నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. కొల్లి బాబి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 180 కోట్ల వసూలు రాబట్టి బాలయ్య కెరీర్ లోనే అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా ప్రగ్య జైశ్వాల్ హీరోయిన్గా నటించగా మిగిలిన పాత్రలలో శ్రద్ధ శ్రీనాథ్ - చాందిని చౌదరి - ఊర్వశి రౌతేలా నటించారు. ఇదిలా ఉంటే ప్రగ్యా జైశ్వాల్ బాలయ్యతో ఇటీవల కాలంలో రెండు సూపర్ హిట్ సినిమాలలో నటించారు. అఖండ సినిమాలో నటించిన ప్రగ్య తాజాగా డాకూ మహారాజ్ సినిమాలను హీరోయిన్గా నటించారు. అలాగే రాబోయే అఖండ టు తాండవం సినిమాలను ప్రగ్య హీరోయిన్గా ఎంపికైనట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే డాకు మహారాజు సినిమాలో ప్రగ్య ప్రెగ్నెన్సీ పాత్రలో కనిపించి ఆకట్టుకుంది.
అయితే ఈ పాత్ర వెనుక ఉన్న ఆసక్తికర విషయాన్ని దర్శకుడు బాబి బయటపెట్టారు. తాము ముందుగా ప్రగ్య ను హీరోయిన్గా తీసుకున్న విషయాన్ని బాలయ్యకు చెప్పి .. ఆమె కు అడ్వాన్స్ ఇచ్చామని ... ఆ తర్వాత ఆమెకు వరుసగా రెండు నాలుగు ఆరు ఎనిమిది నెలల ప్రెగ్నెన్సీ పెట్టి మేకప్ లేకుండా టెస్ట్ చేస్తుంటే ఆమె తన పాత్ర ఇలా ఉంది ఏంటి అని ? ఆశ్చర్యపోయిందని .. ఒకవేళ తాము అడ్వాన్స్ ఇవ్వకుండా ఈ విషయాన్ని బాలయ్యకు చెప్పకుండా ఉంటే కచ్చితంగా ఆమె సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుని ఉండేదని చెప్పాడు. అయితే అప్పటికే అడ్వాన్స్ ఇవ్వడంతో పాటు బాలయ్యకు చెప్పడంతో ప్రగ్య భయపడి ఈ సినిమా షూటింగ్ చేసిందని బాబి సరదాగా చెప్పారు.