- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ లో ఉన్న యంగ్ టాలెంటెడ్ దర్శకలలో హరీష్‌ శంకర్‌ ఒకరు. స్ట్రైట్ సినిమా అయినా రీమిక్స్ సినిమా అయినా కూడా తనదైన మార్క్ టేకింగ్ తో తెర‌కెక్కించే ప్రయత్నం చేస్తారు హరీష్ శంకర్. మరి ముఖ్యంగా 10 ఏళ్లపాటు పవర్‌స్టార్ పవన్కళ్యాణ్ కు హిట్ లేని సమయంలో హిందీలో హిట్ అయిన దబాంగ్ లాంటి సినిమాను తెలుగులో రీమేక్ చేసి గబ్బర్ సింగ్ గా తెరకెక్కించి అదిరిపోయే బ్లాక్ బస్టర్ హీట్ కొట్టడంతో ఒక్కసారి టాలీవుడ్ లో సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అయిపోయారు. గబ్బర్ సింగ్ హిట్ త‌ర్వాత టాలీవుడ్ లో హరీష్ శంకర్‌కు తిరుగు లేకుండా పోయింది. అంతకు ముందు రవితేజతో తెర‌కెక్కించిన మిరపకాయ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత హరీష్ శంకర్ కెరీర్ పరంగా తనదైన స్థాయి హిట్ ఇచ్చేందుకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అయితే ఇటీవల కాలంలో హరీశంకర్ బాలీవుడ్ వచ్చిన సినిమాకు రీమేక్గా రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.


సినిమా రవితేజ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది. చాలా గోరాతి ఘోరంగా ప్లాప్‌ అయింది. ఈ సినిమా నిర్మాత విశ్వప్రసాద్ సైతం ఈ సినిమా ఫలితం పై చాలా తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా విషయంలో హరీశంకర్ చేసిన కామెంట్లు దానికి క్లారిటీ ఇవ్వటంపై సోషల్ మీడియాలో తెలుగు సినీ అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు. మన సినిమాలు మనమే చూడటం అని హరీష్ శంకర్ స్టేట్మెంట్పై విమర్శలు వస్తున్నాయి. ఆల్రెడీ వేరే భాషలో చేసిన సినిమాలు మళ్ళీ రీమిక్ గా తీసుకొస్తే ఎవరు చూస్తారు ? ఎవరూ చూడరని నెటిజన్లు మండిపడుతున్నారు. మనం వేరే భాషలో సినిమాలు చూసి ప్రేరణ పొంది చూసిన సినిమాలు ఇక్కడ తీయొచ్చు అంటూ రివర్స్ లో హరీష్ శంకర్‌పై నెటిజన కౌంటర్లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: