
ప్రభాస్ రెమ్యునరేషన్ 80 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండటం ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగిస్తోంది. ది రాజాసాబ్ సినిమా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు మారుతి దర్శకుడు అనే సంగతి తెలిసిందే. మారుతి ఈ సినిమా కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నారు. మారుతికి కెరీర్ బెస్ట్ హిట్ ఈ సినిమాతో దక్కుతుందేమో చూడాలి.
ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రభాస్ కన్నప్ప సినిమాలో కూడా కీలక పాత్రలో నటించారు. రెమ్యునరేషన్ తీసుకోకుండానే కన్నప్ప సినిమాలో ప్రభాస్ నటించడం గమనార్హం. కన్నప్ప సినిమాలో ప్రభాస్ నందీశ్వరుని పాత్రలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది. ప్రభాస్ లుక్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు.
నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ప్రభాస్ ఎంచుకుంటే మరిన్ని సంచలన విజయాలు సొంతం కావడం పక్కా అని చెప్పవచ్చు. ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ రిపీట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ ఇతర భాషల్లో అంతకంతకూ మార్కెట్ ను పెంచుకుంటుండగా ప్రభాస్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. ప్రభాస్ బాహుబలి తరహా సినిమాలలో నటిస్తే బాగుంటుందని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.