అల్లు అర్జున్ రీసెంట్ గానే పుష్ప2 సినిమాతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు . భారీ స్థాయిలో కలెక్షన్స్ కూడా రాబట్టేలా చేసుకున్నాడు.  మొత్తానికి అల్లు అర్జున్ కి పుష్ప2 సినిమా కొంచెం ప్లస్.. కొంచెం నెగిటివిటి తీసుకొచ్చింది . సినిమాల పరంగా ఆయనను ఎవరు టచ్ చేయలేని స్థాయికి వెళ్తే.. వ్యక్తిగతంగా మాత్రం ఆయనకు కొన్ని ఇబ్బందులు గురి చేసింది పుష్ప2 .  ఆ విషయాలు పక్కన పెడితే ప్రెసెంట్ అల్లు అర్జున్ టోటల్ కాన్సన్ట్రేషన్ తన నెక్స్ట్ సినిమాలపై తన ఫ్యూచర్ పై మాత్రమే ఉంది . 


ఆ కారణంగానే ఆచితూచి సినిమాలను ఓకే చేస్తున్నాడు . ప్రెసెంట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అల్లు అర్జున్ . ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే నెక్స్ట్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమాల్లో నటించబోతున్నాడు అంటూ ఎక్సైటింగ్ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . ఇప్పుడు ఈ న్యూస్ కి మరింత హైప్ పెంచేలా మరొక వార్త హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. ఓ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా హైలెట్ గా మారింది. ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు పెట్టాలి అని చూస్ చేసుకోవడానికి పూర్తి రైట్స్ అల్లు అర్జున్ కి ఇచ్చేసాడట డైరెక్టర్ .



బన్నీ ఎవరిని చెప్తే వాళ్ళని ఈ సినిమాలో ఫైనలైజ్ చేస్తాను అంటూ పూర్తిగా ఆయనకే బాధ్యతలు ఇచ్చేసాడట . దీంతో అల్లు అర్జున్ బాగా ఆలోచించి లేటెస్ట్ సెన్సేషనల్ హీరోయిన్ "జాన్వి కపూర్" అయితే బాగుంటుంది అంటూ ఓకే చేశారట .రష్మిక మందన్నాతో నటించి బోర్ కొట్టేసింది . అంతేకాదు పుష్ప3లో కూడా మళ్లీ రష్మికతోనే రొమాన్స్ చేయాలి . ఈ క్రమంలోనే ఇక యంగ్ హీరోయిన్స్ ఎవరున్నారు అని ఆలోచించగా శ్రీ లీల . ఆల్రెడీ శ్రీలీలతో పుష్ప2లో స్పెషల్ సాంగ్ కంప్లీట్ అయిపోయింది .



మరీ పాన్ ఇండియా సినిమా అంటే ఆ రెంజ్ కు తగ్గ బ్యూటీనే ఉండాలి అంటూ జాన్వికపూర్ ని చూస్ చేసుకున్నారట.  ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈ వార్త బాగా హీట్ పెంచేస్తుంది. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటే ఇక ఆమె కెరియర్ వేరే లెవెల్ లో ముందుకు వెళుతుంది అని.. ఆమె నక్కతోక తొక్కినట్లే అని జాన్వి కపూర్ బన్నీతో సినిమాను వేరే లెవెల్ లో పర్ఫామెన్స్ చూపిస్తే ఇంకా బాగుంటుంది అని ఆశ పడుతున్నారు.  ప్రజెంట్ సోషల్ మీడియాలో జాన్వి కాపూర్ - అల్లు అర్జున్ ల పేర్లు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: