గత ఏడు నెలల క్రితం టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ,లావణ్య కేసు ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ప్రేమించి, పెళ్లి చేసుకొని తనను మోసం చేశారని లావణ్య రాజ్ తరుణ్ పై కేసు పెట్టింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మస్తాన్ సాయి గురించి మీడియా ముందుకు వచ్చింది లావణ్య. తనను డ్రగ్స్ కు అలవాటు చేసి ఆ తర్వాత ప్రైవేట్ వీడియోలు చేసి వాటితో బెదిరిస్తున్నాడు అంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు మస్తాన్ సాయిని అరెస్టు చేసి విచారించగా విస్తుపోయే నిజాలు తెలిపారు.

లావణ్యను డ్రగ్స్ కు అలవాటు చేసి ఆమె సహకారంతోనే ఆమెపై అత్యాచారం చేశాను అంటూ ఒప్పుకున్నారు.  అంతేకాదు చాలామంది హార్డ్ డిస్క్లో ఉన్న అమ్మాయిల అందరికీ తానేడ్రగ్స్ అలవాటు చేశానని , వారి సహకారంతోనే ప్రైవేటు వీడియోలు తీసి హార్డ్ డిస్క్లో స్టోర్ చేశానని చెప్పడంతో ఆ పోలీసులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు సెక్షన్ల కింద మస్తాన్ సాయిపై కేసు నమోదు అవ్వడం జరిగింది. లావణ్య పై మస్తాన్ సాయి దారుణంగా దాడి చేయగా అప్పట్లోనే గుంటూరు పట్టాభిపురం పోలీసులు 307,376, 506, 509, 323 ఐపిసి సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. అయినా ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడంపై ఆంధ్రప్రదేశ్ డీజీపీకి, గుంటూరు జిల్లా ఎస్పీకి నోటీసులు పంపించారు అడ్వకేట్ నాగూర్ బాబు.

ఇకపోతే మస్తాన్ సాయి తండ్రి రామ్మోహన్ రావుకి ఉన్న పలుకుబడి కారణంగానే గుంటూరు పట్టాభిపురం పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయలేదట.  కానీ ఇప్పుడు మస్తాన్ సాయి పై గుంటూరు పోలీసులు తగు చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే పలు సెక్షన్లపై మస్తాన్ సాయి. పై కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రోజు రోజుకి మస్తాన్ సాయి మెడకు ఉచ్చు బిగిస్తోంది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: