
ఇక నేడు తారకరత్న రెండో వర్దంతి. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ లో 'నువ్వు నన్ను విడిచి వెళ్లిపోయావు. నువ్వు వెళ్లిపోయాక మిగిలిన ఈ శునాన్ని ఈ ప్రపంచంలో ఇంకేది భర్తీ చేయలేదు. ఈ విధి నిన్ను మా నుండి దూరం చేసింది. ఈ గాయాన్ని కాలం కూడా మాన్పించలేదు. నువ్వు లేవని తెలిశాక బద్దలైన నా గుండెని కూడా మళ్లీ అతకలేదు. మనం ఇలా విడిపోకుండా ఉండాల్సింది. నువ్వు మాతో ఉండిపోవాల్సింది. కానీ ఇప్పుడు నువ్వు మాతో ఉండకపోవచ్చు. అయినప్పటికీ నీ ప్రభావం మా జీవితాల పైన ఎప్పటికీ ఉంటుంది. మా కలలో నువ్వు ఎప్పటికీ బతికే ఉంటావు. నువ్వు లేని ఈ బాధని నేను మాటల్లో చెప్పలేను. మిస్ యూ' అంటూ అలేఖ్య వారి ఫ్యామిలీ ఫోటోను పెట్టి రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన ప్రేక్షకులాంత చాలా ఎమోషనల్ అవుతున్నారు.
తారక రత్న గురించి అలేఖ్య నిత్య ఏదోక పోస్ట్ పెడుతూనే ఉంటుంది. ఆమె తారకరత్న ని ఓబు అంటూ ప్రేమగా పిలుస్తూ ఉండేది. ఇప్పుడు ఆమె పెట్టె పోస్టులలో కూడా ఓబు అంటూ రాసుకొస్తుంది. ఇప్పుడు అలేఖ్య పిల్లలే తన ప్రపంచంగా బతికేస్తుంది. ఇంత జరిగిన కూడా నందమూరి ఇంటి వారు అలేఖ్యని, తన పిల్లల్ని చెరదీయలేదు. కానీ ఇటీవల బాలయ్య బాబు, విజయసాయి రెడ్డి మాత్రమే తనకు అండగా నిలిచారని ఆమె చెప్పుకొచ్చింది.