![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/bramha-anandam-1de4b5e5-07c1-44e2-8f1a-89b5f3d55a35-415x250.jpg)
సౌండ్‌ట్రాక్ ఆల్బమ్ మరియు నేపథ్య సంగీతాన్ని శాండిల్య పిసాపతి అందించారు. ఈ సినిమాలో తండ్రికొడుకు అయిన బ్రహ్మానందం, గౌతమ్.. తాత మనవడు పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో రాజా గౌతమ్ నటన చాలా బాగుందని టాక్ వినిపించింది. అలాగే బ్రహ్మానందం, వెన్నల కిషోర్ కామోడీ అద్బుతంగా ఉందని అన్నారు. మంచి భావోద్వేగాలను ఈ సినిమా అందించిందని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాని ఎలాగైనా హిట్ కొట్టించాలని బ్రహ్మానందం అనుకున్నారు. ఈ సినిమా ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవిని పిలిచారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా మంచి పాపులారిటీ, పేరు కోసం ప్రెస్ మిట్స్ కూడా పెట్టారు. అలాగే చాలానే యూట్యూబ్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు.
ఇక ఈ సినిమా మంచి టాక్ రావడం కోసం ఆర్ఆర్ఆర్ సినిమా హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా వారి సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టుకునేలా చేశారు. ఇటీవల ఎన్టీఆర్.. 'మీ సినిమా గురించి పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. కంగ్రాట్యులేషన్స్ టు బ్రహ్మానందం అండ్ టీమ్ అని పెట్టుకొచ్చాడు. దానికి బ్రహ్మానందం 'ఈ ఫీలింగ్ ఏంట్రా..! గుండె ఏదో వణుకుతున్నట్టు ఉందిరా. థాంక్స్ నాన్న' అని రిప్లై ఇచ్చారు. ఇక రామ్ చరణ్ కూడా మూవీ టీమ్ కి ఇలాగే కంగ్రాట్యులేషన్స్ చెప్పాడు. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా హీరోలు బ్రహ్మానందంకి అండగా నిలబడ్డారని అనుకుంటున్నారు.