రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కల్కి సినిమా తర్వాత ప్రభాస్ వరుస సినిమాలను లైనప్ చేశారు. సలార్, కల్కి హిట్స్ తర్వాత ప్రభాస్ సినిమాల పై అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం రాజాసాబ్, సలార్ 2, కల్కి 2, హనురాఘపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు సందీప్ రెడ్డి  వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా సందీప్ రెడ్డికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా తన కెరీర్ మొదలు పెట్టిన సందీప్. తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకున్నాడు. ఆతర్వాత హిందీలోకి అడుగుపెట్టాడు. అక్కడ అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేసి హిట్ అందుకున్నాడు.ఇదిలావుండగా సందీప్ వంగ లాంటి ఊర మాస్ పాన్ ఇండియన్ డైరెక్టర్ తో సినిమా అంటేనే అభిమానులు సన్నివేశాలను ఊహించేసుకుంటున్నారు. పైగా కొరియన్ సూపర్ స్టార్ డాన్ లీ ఇందులో నటిస్తున్నాడు అనే వార్త వచ్చినప్పటి నుండి అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆతృతగా ఎదురు చూసేలా చేసింది ఈ అంశం. ఈ చిత్రం లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే.

చాలా వయొలెంట్ గా ఆయన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నాడు సందీప్ వంగ.ఈ క్రమంలో ప్రభాస్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు అని సందీప్ రివీల్ చేయడం జరిగింది. అలాగే హాలీవుడ్ నటుడు డాన్లీ కూడా ఇందులో నటిస్తున్నాడు అనే చర్చ కూడా నడుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. అయితే కొంతమంది ఫ్యాన్స్ ఆత్రం ఆపుకోలేక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో 'స్పిరిట్' షూటింగ్ ఎలా ఉంటుందో..అందులో సీన్లు ఎలా ఉంటాయో.. షూటింగ్ తర్వాత ప్రభాస్ ఎలా ఉంటాడో? అనేది చిత్రీకరించి ప్రచారం చేస్తున్నారు. షూటింగ్ టైంలో ప్రభాస్,దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ల మధ్య చర్చ సినిమాలో యాక్షన్ సీన్, అందులో పోలీస్ డ్రెస్ లో ప్రభాస్ కనిపించడం, షూటింగ్ అయిపోయాక నటుడు డాన్లీ ని తన అతిధి మర్యాదలతో ప్రభాస్ టార్చర్ పెట్టడం,చివరికి అతను దండం పెట్టేయడాన్ని ఇందులో ఫన్నీ వేలో చూపించారు. దీంతో మరి కొంతమంది అభిమానులు 'ప్రభాస్, సందీప్.. త్వరగా షూటింగ్ స్టార్ట్ చేయండి, లేకపోతే మీ ఫ్యాన్స్ ఏఐతో సినిమా తీసేసి నెట్లో వదిలేసేలా ఉన్నారు' అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో ‘రాజా సాబ్’ చిత్రం దాదాపుగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. అన్ని కరెక్ట్ గా జరిగుంటే ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలయ్యేది. కానీ ప్రభాస్ కాళ్లకు దెబ్బలు తగలడంతో ఆయన విశ్రాంతి తీసుకోవడం వల్ల ఈ కాస్త షూటింగ్ బ్యాలన్స్ ఉంది. విదేశాల నుండి తిరిగి రాగానే ఆయన ‘రాజా సాబ్’ మూవీ సెట్స్ లోకి అడుగుపెడుతాడని అందరూ అనుకున్నారు. కానీ ఆయన హను రాఘవపూడి తో తెరకెక్కిస్తున్న మూవీ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక, ఆయన ‘స్పిరిట్’ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: