నేషనల్ క్రష్ రష్మిక మందన్న, విక్కి కౌశాల్ లు నటించిన చావా మూవీ ప్రస్తుతం ఒక రేంజ్ లో వసూళ్లను రాబడుతుంది.ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన ఈ సినిమా కొద్ది కాలంలో వంద కోట్ల క్లబ్ లలో చేరిపోయింది. మరిన్ని రికార్డులను క్రియేట్ చేసే దిశగా దూసుకుపోతుంది ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర స్వరాజ్య ప్రదాత ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుకు శంభాజీ మహారాజ్ చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. లక్ష్మణ్ ఉటేకర్ చావాకు దర్శకత్వం వహించారు. ఇదిలా ఉండగా.. చావా సినిమాను చూసిన వాళ్లంతా థియేటర్లలో ఎమోషన్ కు గురౌతున్నారు.ఈ క్రమంలోనే మహారాష్ట్రలో శివాజీ వంశానికి ఉన్న విశేషమైన అభిమాన బలం సినిమాకు ప్లస్ అవ్వడంతో, అక్కడ ఊహించని స్థాయిలో వసూళ్లు నమోదయ్యాయి. ఇక వీకెండ్ లో ఆదివారం వరకు కలెక్షన్లు భారీగా పెరిగి ఓవర్‌సీస్ సహా టోటల్ 106 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం కూడా మంచి నెంబర్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో లెక్క 120 కోట్లకు చేరినట్లు టాక్.ముఖ్యంగా ముంబయి, పూణే ప్రాంతాల్లో ఈ సినిమాకు భారీ ఆదరణ లభిస్తోంది. శివాజీ మహారాజ్ వారసుడి కథ కావడం వల్ల, ఈ ప్రాంతంలో చావా సినిమాకు ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ అయింది. అయితే, ఉత్తర భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో ఓపెనింగ్స్ స్టడీగానే ఉన్నప్పటికీ, మహారాష్ట్ర స్థాయిలో ఆకర్షించలేదని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ పాజిటివ్ మౌత్ టాక్ సినిమా రన్‌ను కంటిన్యూ చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

ఇదిలావుండగా ఇప్పటికే వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి వీక్ డేస్‌లో కూడా స్ట్రాంగ్‌గా కొనసాగుతున్న ఈ సినిమాను కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ అయింది. అయితే ఈ చిత్రం కోసం ఇతర భాషల వారు కూడా మాట్లాడుకుంటున్నారట. మెయిన్‌గా మన తెలుగు ఆడియెన్స్‌లో చావా ప్రస్తావన సోషల్ మీడియాలో ఎక్కువ వినిపిస్తోంది. బాలీవుడ్ నుంచి ఏవేవో సినిమాలు పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నారు కానీ ఇలాంటి సినిమాలు కదా రిలీజ్ చెయ్యాలి అని వారు భావిస్తున్నారు. ఇండస్ట్రీ ఏదైనా కథ నచ్చితే తెలుగు ఆడియన్స్ కచ్చితంగా ఆ మూవీని సపోర్ట్ చేస్తారు. అలా వచ్చి తెలుగులో హిట్ అయిన చిత్రాలు బోలెడన్ని ఉన్నాయి. ప్రజంట్ టాలీవుడ్ రేంజ్ కూడా అని ఇండస్ర్టీ తో పోలిస్తే ముందజలో ఉంది. ఇక ఇవన్నీ తెలిసి కూడా చావా మేకర్స్ ఇంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకుంటున్నారనే చెప్పాలి.అయితే తెలుగు వారినీ త్వరలోనే పలకరించనుందని తెలుస్తోంది.అయితే థియేటర్ వెర్షన్ కాదు. ఓటిటిలో సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ డబ్బింగ్ చేసి రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే ఇక్కడ బిజినెస్ బాగా నడుస్తుందనుకుంటే తెలుగు డబ్బింగ్ వెర్షన్ ని సైతం రిలీజ్ చేసే ఆలోచనలో టీమ్ ఉన్నట్లు ట్రేడ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: