యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో హ్యాట్రిక్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘యమదొంగ’. ప్రియమణి, మమత మోహన్ దాస్ లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ‘విశ్వామిత్ర క్రియేషన్స్’ బ్యానర్ పై ఊర్మిళ గుణ్ణం, చెర్రీ లు కలిసి నిర్మించారు. మోహన్ బాబు కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. 2007 వ సంవత్సరం ఆగష్ట్ 15 న ఈ చిత్రం విడుదల అయ్యింది.యమదొంగ చిత్రం కమర్శియల్‌గానూ మ్యూజికల్‌గానూ మంచి విజయాన్ని సాధించింది. అయితే ఫస్ట్ డే టాక్ ఎన్టీఆర్ కు నిద్రపట్టనివ్వకుండా చేసిందిట. అసలేమైందంటే యమదొంగ’ రిలీజ్ కు ముందు తన వాళ్లతో కలిసి ఎన్టీఆర్ చూసినప్పుడు జస్ట్ ఓకే అనుకున్నారట. యమలోకం వంటివి ఇప్పుడు వర్కవుట్ అవుతాయా అని ఆయన సన్నిహితులు అన్నారట. మోహన్ బాబు డామినేషన్ కనపడుతోంది అని మరికొందరు అన్నారట. అందుకు తగ్గట్లే ‘యమదొంగ’ మార్నింగ్ షో టాక్ సూపర్ హిట్ అని రాలేదు. యావరేజ్, బిలో యావరేజ్ అన్నట్లు వచ్చిందిట. ఇంట్రవెల్ సీన్ మాత్రమే హైలెట్ అని మీడియాలో ప్రచారం మొదలైంది.

అప్పట్లో ఇప్పుడున్నంత సోషల్ మీడియా లేకపోయినా రివ్యూలు వచ్చేవి. ఈ క్రమంలో ఎన్టీఆర్ కు రాత్రి నిద్రపట్టలేదట. అయితే రెండు రోజుల లోపే సినిమా పెద్ద హిట్ అయ్యింది. అందరి అంచనాలను తల క్రిందలు చేసింది.  ఇరవై కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం ఫస్ట్ వీక్ లోనే 11 కోట్లు రాబట్టింది.  రాజమౌళి మ్యాజిక్ మెల్లిమెల్లిగా ఎక్కేసింది. ఎన్టీఆర్ డాన్స్ లకు ఫిదా అయ్యిపోయారు. అప్పుడు తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఎన్టీఆర్ పెద్ద  పార్టీ ఇచ్చారట.ఇదిలావుండగా యమదొంగ’ చిత్రానికి రూ.24.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.28.80 కోట్ల షేర్ ను రాబట్టి.. బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లకు భారీగా రూ.4 కోట్ల వరకు లాభాలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: