
సాయి పల్లవి లాంటి హీరోయిన్లు ఇండస్ట్రీలో అసలు సెట్ కాలేరు. డెవలప్ అవ్వలేరు . కానీ సాయి పల్లవి మాత్రం వాటి అన్నిటిని తప్పు అంటూ ప్రూవ్ చేస్తుంది . ఎక్స్పోజింగ్ చేయకపోయినా సరే ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదగగలము అని టాలెంట్ ఉంటే జనాలు ఎంకరేజ్ చేస్తారు అని ప్రూవ్ చేసింది. అయితే ఇటీవల జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకోవాలని ఉంది అంటూ తన కోరికను బయటపెట్టింది సాయి పల్లవి.
దీని గురించి సాయి పల్లవి మాట్లాడుతూ.." 21 ఏళ్ల వయసులో తన బామ్మ ఓ చీర ఇచ్చారు అని ..దాన్ని తన పెళ్లి రోజున కట్టుకోమని చెప్పారు అని .. అప్పటికి తను సినిమాలోకి రాలేదు అని కాబట్టి పెళ్లి చేసుకున్నప్పుడు కట్టుకుందాం అని అనుకున్నాను అని.. బాగా దాచిపెట్టాను అని .. అయితే 23 ఏళ్ల వయసులో ప్రేమమ్ చిత్రంలో అవకాశం వచ్చి విడుదలైన తర్వాత ఏదో ఒక రోజు ప్రతిష్టాత్మక అవార్డు అందుకుంటాను అన్న నమ్మకం కలిగింది అని ఆరోజు .. ఆ అవార్డు అందుకున్న మూమెంట్లో అమ్మమ్మ చీర కట్టుకొని అవార్డుల ప్రధాన ఉత్సవానికి హాజరు కావాలి అని ఆశ పడుతున్నాను అంటూ చెప్పుకు వచ్చింది".
దీంతో సాయి పల్లవి కోరిక ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అయితే సినిమాలో ఆమె రొమాంటిక్ సన్నివేశాలకు దూరంగా కూడా నటించినప్పటికీ జనాలు ఆమెను ఎక్కువగా లైక్ చేయడానికి కారణం ఆమె నీతి నిజాయితీ అని ..ఇంత నీతి నిజాయితీగల హీరోయిన్ కి అవార్డు రాకపోతే మరి ఏ హీరోయిన్ కి వస్తుంది అంటూ సాయి పల్లవి ఫ్యాన్స్ ఆమెకు నెక్స్ట్ అవార్డు కన్ఫామ్ గా జాతీయ ఉత్తమ నటిగా వస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు . అమరన్ సినిమాలోని పర్ఫామెన్స్ కు జాతీయ అవార్డు ఇవ్వాలి అంటూ కోరుకుంటున్నారు..!