రీసెంట్ గా రిలీజ్ అయినా “చావా”బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చావా సినిమాకు ఎందరో సినీ ప్రముఖుల నుండి ప్రశంసల వర్షం కురుస్తోంది. మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ కథను ఎంతో గొప్పగా తెరకెక్కించారని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.. థియేటర్ లో ఎమోషనల్ సీన్స్ తో కన్నీళ్లు పెట్టించారని ప్రేక్షకులు భావోద్వేగంతో చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి..

అయితే బాలీవుడ్ లో గతంలో  తానాజీ, బాజీరావు మస్తానీ, పద్మావతి వంటి ఎన్నో  చారిత్రాత్మక సినిమాలు వచ్చాయి.. కానీ ఆ సినిమాలు ఈ రేంజ్ హిట్ అవ్వలేదు..అయితే చావా లాంటి నేపధ్యాలు టాలీవుడ్ లో  కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి.కమర్షియల్ గానూ గొప్ప విజయం సాధించినవి ఎన్నో సినిమాలు వున్నాయి..వింటేజ్ కాలం నుంచి గమినిస్తే స్వర్గీయ ఎన్టీఆర్ బొబ్బిలి యుద్ధం,పల్నాటి యుద్ధం వంటి సినిమాలు చరిత్ర లో నిలిచిపోయాయి..అలాగే కృష్ణంరాజు తాండ్ర పాపారాయుడు, కృష్ణ విశ్వనాథ నాయకుడు, సింహాసనం ఇవన్నీ 80 దశకంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలు. అప్పటి దర్శకులు ఎంతో పరిశోధన చేసి ఈ సినిమాలు రూపొందించారు.

విజువల్ ఎఫెక్ట్స్ లేని కాలంలో సహజత్వం కనిపించే విధంగా భారీ సెట్స్ తో ప్రేక్షకులని అబ్బురపరిచేవారు..ప్రస్తుత కాలంలో కూడా ఇలాంటి చారిత్రక నేపథ్యం వున్న సినిమాలు తెరకెక్కాయి..అనుష్క నటించిన రుద్రమదేవి, బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణి, చిరంజీవి సైరా నరసింహారెడ్డి వంటి క్లాసిక్స్ ఇప్పటి తరానికి మన దర్శకులు పరిచయం చేసారు.టాలీవుడ్ లో సైతం ఇలాంటి చారిత్రాత్మక సినిమాలకు మంచి ఆదరణ లభించింది.. త్వరలో రాబోయే పవర్ స్టార్ ‘హరిహర వీరమల్లు’,నిఖిల్ “స్వయంభు” సినిమాలు కూడా ఇలాంటి నేపథ్యం లో తెరకెక్కింనవే..నార్త్ దర్శకులు కంటే ముందుగానే మన సౌత్ దర్శకులు ఇలాంటి అద్భుతమైన మూవీస్ తెరకెక్కించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: