
కాగా "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. వంద కోట్లు క్రాస్ చేయడమే కాకుండా ప్రతి ఒక్క నటుడుకి నటికి మంచి మార్కులు పడేలా చేసింది . మరీ ముఖ్యంగా ఈ సినిమాతో అందరికన్నా ఎక్కువగా లాభ పడింది మాత్రం ఐశ్వర్య రాజేష్..హీరోయిన్ సౌందర్య ప్లేస్ ని రీప్లేస్ చేసింది అంటూ అంతా మాట్లాడుకుంటూ వస్తున్నారు. తాజాగా ఐశ్వర్య రాజేష్ తల్లి హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ పెళ్లి గురించి కూడా మాట్లాడింది .
"మా కూతురికి ప్రస్తుతం మంచి మంచి సినిమా అవకాశాలు వస్తున్నాయి .. ఆమె కెరియర్ ఇంకా ముందుకు వెళుతుంది.. ఈ సినిమా ద్వారా సౌందర్య స్థానాన్ని భర్తీ చేసింది అని చాలామంది మాట్లాడుకుంటున్నారు . అది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది . ఐశ్వర్య రాజేష్ కి పెళ్లి సంబంధాలు చూస్తున్నాము.. పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తున్నాం.. ఒక్కవేళ్ల మంచి సంబంధం దొరికితే మాత్రం నెక్స్ట్ ఇయర్ చేస్తాము" అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చింది .సాధారణంగా స్టార్ హీరోయిన్స్ పెళ్లిపై ఇలా తల్లి ఎవ్వరూ ఓపెన్ గా స్పందించరు . కానీ ఐశ్వర్య రాజేష్ తల్లి మాత్రం అందరి ముందే ఇలా ఆమె పెళ్లి పై స్పందించడం అందరికీ షాకింగ్ గా ఉంది .