- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే అదిరిపోయే క్రేజ్ ఉండాలి .. కానీ చిరు పదివేల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాక‌ చిరంజీవి సినిమాల పట్ల ప్రేక్షకుల్లో ఎందుకో గాని ఆసక్తి ఉండటంలేదు. చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చాక ఖైదీ నెంబర్ 150 సినిమాతో ఆయన తెర‌ మీద కనిపించారు. ఆ సినిమా హిట్ అయిన రీమేక్ ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి - ఆచార్య - భోళాశంకర్ సినిమాలు పెద్ద డిజాస్టర్లు అయ్యాయి. మధ్యలో వాల్తేరు వీరయ్య ఒక మోస్త‌ర్ గా ఆడింది. ప్రస్తుతం చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో చేస్తున్న విశ్వంభ‌ర‌ సినిమా మీద కూడా ఎవరికీ పెద్దగా నమ్మకాలు లేవు. అసలు ఈ సినిమా ఓటీటి హక్కులు 50 కోట్లు చెబుతున్న ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో యూవీ క్రియేషన్స్ వాళ్ళు సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి ఇప్పుడు చిరంజీవి కాంబినేషన్లో తెర‌కెక్కే సినిమాకు కూడా అనుకున్న స్థాయిలో క్రేజీ ఉండటం లేదు.


ఓ వైపు అనిల్ రావిపూడి వరుస సూపర్ డూపర్ హిట్టులతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. కానీ చిరంజీవిసినిమా కోసం 75 కోట్ల రెమ్యూనరేషన్తో పాటు బ్యానర్ ఇచ్చినందుకు చిరు కుమార్తెకు మరో 10 కోట్లు మొత్తం 85 కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. సినిమా బడ్జెట్ దాదాపు 200 కోట్లు ఉంటుందని అంటున్నారు. సినిమా ఎంత పెద్ద హిట్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలా 300 కోట్లు కొల్లగొడుతుందని అనుకోలేము. పైగా చిరంజీవి సినిమాలు మిక్స్డ్ టాక్ వస్తే ఎవరూ పట్టించుకోవడం లేదు. ఏది ఏమైనా చిరంజీవి సినిమాలు అంటే ఇటీవల కాలంలో పెద్దగా ఆసక్తి ఉండటం లేదు. విశ్వంభర సినిమా మీద‌ కూడా బిజినెస్ వర్గాల్లో ఎలాంటి ఆసక్తి లేదు. మరి ఈ టైం లో 200 కోట్లతో చిరంజీవి సినిమా తెరకెక్కుతోంది అంటే చాలా పెద్ద రిస్క్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: