మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర”.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ గత ఏడాది సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. ఆరేళ్ళ తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడంతో దేవర సినిమాపై ఫ్యాన్స్ లో ఫుల్ క్రేజ్ ఏర్పడింది.. కానీ దేవర రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది.. ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా 550 కోట్ల కలెక్షన్స్ సాధించింది..

 ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ “వార్ 2” లో నటిస్తున్నాడు..బ్రహ్మస్త్ర దర్శకుడు అయాన్ ముఖర్జి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది..ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది..దేవర’ సినిమాతో ఎన్టీఆర్ పూర్తిస్థాయిలో అలరించలేదు. . కేవలం ఈ సినిమా 500 కోట్ల కలెక్షన్లను మాత్రమే రాబట్టడంతో పాన్ ఇండియాలో ఎన్టీఆర్ కి అంత పెద్ద మార్కెట్ అయితే లేదనే న్యూస్ వైరల్ అయింది..

ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటించినా సెకండ్ హీరో అనే ముద్ర పడింది.. ఆ సినిమా భారీ హిట్ అయినా ఎన్టీఆర్ కి సోలో హీరోగా క్రేజ్ రాలేదు.. ఇప్పుడు వార్ 2 సినిమాలో కూడా ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.. ఈ సినిమా హిట్ అయినా కూడా ఎన్టీఆర్ కి సోలో హీరో ఇమేజ్ రాదు.. దీనితో ఎన్టీఆర్ సెకండ్ హీరోగా పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది.. తన తోటి హీరోలు ప్రభాస్, అల్లుఅర్జున్ పాన్ ఇండియా క్రేజ్ తో దూసుకుపోతుంటే ఎన్టీఆర్ మాత్రం ఎలాంటి సినిమాలు చేయాలో తేలిక ఇబ్బంది పడుతున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: