
ఇప్పుడు సుకుమార్ పేరు చెప్తే పాన్ ఇండియా హీరోలే కాదు గ్లోబల్ హీరోలు కూడా కచ్చితంగా అరగంట సేపు అయినా ఆయన గురించి మాట్లాడుకుంటారు . అలాంటి ఒక క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు . అయితే ఇప్పటివరకు సుకుమార్ తన కెరీర్ లో ఏ హీరోయిన్ రిపీట్ చేయలేదు . ఆ విషయం అందరికీ తెలుసు . కొత్త హీరోయిన్స్ ని సరికొత్తగా చూపించడం సుకుమార్ కి బాగా అలవాటు . మరీ ముఖ్యంగా హీరోయిన్ నాచురల్ గా ట్రెడిషనల్ లుక్స్ లోనే మెరిసేలా చేస్తూ ఉంటాడు సుకుమార్ .
అయితే ఫర్ ద ఫస్ట్ టైం తన కెరియర్ లో హీరోయిన్ రష్మిక మందన్నాను రిపీట్ చేయబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. పుష్ప - పుష్ప2 రెండు సినిమాలలో హీరోయిన్గా రష్మికనే పెట్టుకున్నాడు. దాదాపు ఐదేళ్ల కు పైగానే రష్మిక తో వర్క్ చేశాడు సుకుమార్ . అసలు పుష్ప సినిమా హిట్ అవ్వడానికి టోటల్ కారణం రష్మిక నే అని చెప్పుకొచ్చారు బన్నీ-సుకుమార్. అంత బాగా సపోర్ట్ చేసింది రష్మిక . అయితే రామ్ చరణ్తో - సుకుమార్ తెరకెక్కించే సినిమా కోసం మళ్లీ హీరోయిన్గా రష్మిక నే చూస్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . రాంచరణ్ - సుకుమార్ సినిమా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కబోతుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ఏకైక పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్నానే. ఆ కారణంగానే రష్మిక ని మళ్లీ చూస్ చేసుకున్నారట . అలా ఫస్ట్ టైం తన సెంటిమెంట్ బ్రేక్ చేసి మరి ఒక హీరోయిన్ ని రిపీట్ చేయబోతున్నాడు సుకుమార్..!