- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కి తెలుగు హీరోలు కనెక్ట్ అవ్వటం లేదా అందుకే ఇతర భాషలో హీరోలపై ముగ్గు చూపుతున్నారా ? అంటే అవుననే టాలీవుడ్ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు వెంకీ అట్లూరి డైరెక్ట్ గా ఐదు సినిమాలు చేశాడు. అందులో రెండు సినిమాలు ఇతర భాషలకు చెందిన హీరోలతో చేశాడు. తొలిప్రేమతో దర్శకుడుగా పరిచయమయ్యాడు. అందులో మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా నటించాడు. ఆ సినిమా హిట్ అయింది. ఆ తర్వాత అక్కినేని అఖిల్ తో మిస్టర్ మజ్ను సినిమా చేస్తే మిక్స్డ్ టాక్ వచ్చింది.ఆ సినిమా అనుకున్న స్థాయి లో అయితే ఆడ‌లేదు. అనంతరం నితిన్ తో రంగ్ దే సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత అట్లూరి తెలుగు హీరోల వైపు చూడటం లేదు. ధనుష్తో సార్ సినిమా తెలుగు - తమిళ భాషలలో తెరకెక్కించి బ్లాక్బస్టర్ అందుకున్నాడు.


విద్యావ్యవస్థను టచ్ చేస్తూ తెరకెక్కిన సినిమా ఇది. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా లక్కీ భాస్కర్ సినిమా తెరకెక్కించాడు. డబ్బుంటేనే మనిషికి విలువ అన్న పాయింట్ ని బలంగా చెప్పాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఈ విజయంతో వెంకీకి దర్శకుడు ఇంకా మంచి పేరు వచ్చింది. అయితే ఇవే సినిమాలు తెలుగు హీరోలతో ఎందుకు ? చేయటం లేదు అన్నది ఇక్కడ ఎదురవుతున్న ప్రశ్న. టాలీవుడ్ హీరోలు ఆ కథలకు సెట్ అవ్వటం లేదా ? వాళ్ళు డేట్ లు ఇవ్వటం లేదా వెంకీ అట్లూరిని ఎవరు నమ్మటం ? లేదా మరి ఎందుకు ఇతర భాషల హీరోలతో వెంకి ఇలా చేస్తున్నాడు అంటే బిజినెస్ పరంగా కలిసి వస్తుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: