- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నేషనల్ క్రిష్మిక‌ రష్మిక మందన టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మధ్య రిలేషన్ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఒక రేంజ్ లో డిస్కషన్లు జరుగుతూ ఉంటాయి. ఏ వెకేషన్కు వెళ్లిన విజయ్తో పాటు రష్మిక వెళ్ళటం .. రష్మిక పోస్ట్ చేసిన ప్లేస్ లోనే విజయ్ ఫోటోలు కూడా ఉండడంతో వీరిద్దరు ఎప్పటినుంచో కలిసే ఉంటున్నారు అన్న చర్చలు ఉన్నాయి. అయితే రష్మికకు కేవలం విజయ్ తోనే కాదు .. విజయ్ కుటుంబంతో కూడా మంచి సన్నిహిత సంబంధం ఉంది. ఆనంద్‌ దేవరకొండ నటించిన ఎన్నో సినిమాలు ఎన్నో రష్మిక ప్రమోట్ చేయటమే కాకుండా తిరిగి రిలీజ్ ఈవెంట్ మూవీ ప్రీమియర్లకు కూడా వెళుతూ దేవరకొండ ఫ్యామిలీతో ఉన్న బలమైన అనుబంధాన్ని బయటపెట్టిందే రష్మిక. ఇటీవల విజయ్ తల్లి మాధవి ర‌ష్మిక కు గులాబీ పూలు పంపగా రజనీకా ఆ ఫోటోని తన ఇన్‌స్టాల్ పోస్ట్ చేస్తూ నన్ను ఎలా సంతోషంగా ఉంచాలో నీకు బాగా తెలుసు పాపలు అని రాసింది.


దీంతో వారిద్దరి మధ్య ఎంత స్ట్రాంగ్ రేషన్ ఉందో రష్మిక చెప్పకనే చెప్పింది. ఇప్పుడు విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా రష్మిక పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. చావా సినిమాతో రష్మిక వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోని రష్మికకు విషెస్ చెబుతూ వర్క్ పై నీకున్న క్రమశిక్షణ డేడికేషన్ నీకు ఈ విజయాలను తెచ్చిపెట్టాయని రాసి ఉన్న ఓ ఫోటో షేర్ చేశాడు ఆనంద దేవరకొండ. దానికి రష్మిక మూడు హార్ట్ ఎమోజిలతో ఆనంద్‌ పోస్టును రీ షేర్‌ చేసి దేవరకొండ ఫ్యామిలీతో తనకున్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఏది ఏమైనా ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న బాండింగ్ నెక్స్ట్ లెవెల్ కు ఎప్పుడు వెళుతుందా ? అని అందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: