- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నందమూరి నట‌సింహ ... గాడ్ ఆఫ్ మసీస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఉన్నాడు. బాలయ్య కెరీర్లో చాలా ఏళ్ల తర్వాత వరుసగా నాలుగు సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఆయన ఖాతాలో పడ్డాయి. ఈ క్రమంలోని ఈ ఏడాది సంక్రాంతికి బాబీ దర్శకత్వంలో బాలయ్య నటించిన డాకు మహారాజ్‌ సినిమా కూడా మంచి హిట్ అయింది. బాలయ్య సినిమాలు వరుసగా సూపర్ హిట్ అవుతూ ఉండడంతో బాలయ్య అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బాలయ్య నటించిన గత కొన్ని సినిమాలను గమనిస్తే మనకు కామన్ పాయింట్ కనిపిస్తుంది. ఆయన నటించిన అఖండ - వీర సింహారెడ్డి - భగవంత్‌ కేసరి - డాకు మహారాజ్‌ సినిమాలకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలు మ్యూజికల్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.


ఈ కారణంగానే బాల‌య్య‌ రీసెంట్గా తమన్‌కు ఖ‌రీదైన కారు ను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే . . అయితే ఈ బ‌హుమ‌తి ని బాలయ్య తన తర్వాత సినిమా అఖండ 2 తాండ‌వం సినిమా రెమ్యూనరేషన్ నుంచి ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అఖండ టు కోసం బాలయ్య తన రెమ్యూనరేషన్ 28 కోట్ల నుంచి ఏకంగా ఏడు కోట్లు పెంచి 35 కోట్లుగా తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఈ పెంచిన రెమ్యూనరేషన్ నుంచి ఆయన తమన్ కు కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి వార్తల లో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. ఇక బాల‌య్య న‌టిస్తోన్న అఖండ ద‌స‌రా కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య మ‌రోసారి మ‌లినేని గోపీచంద్ డైరెక్ష‌న్ లో సినిమా చేయ‌నున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: