పూజా హెగ్డే ఎప్పుడైతే అలవైకుంఠ పురం సినిమాలో బుట్ట బొమ్మ అనే పాటలో చేసిందో అప్పటినుండి సౌత్ బుట్ట బొమ్మగా పేరుగాంచింది. అయితే అలాంటి  ఈ ముద్దుగుమ్మ చాలా రోజుల నుండి సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు ఎక్కువగా అందుకోవడం లేదు. పూర్తిగా నార్త్ ఇండస్ట్రీ పైనే దృష్టి పెట్టడంతో సౌత్ ఇండస్ట్రీలో పూజ హెగ్డే ని మర్చిపోయారు.అయితే నార్త్ లో ఈమె చేసిన సినిమాలు కూడా అంతగా హిట్ అవ్వకపోవడంతో అక్కడ అవకాశాలు లేక ఇక్కడ అవకాశాలు లేక ఇబ్బందులు పడుతోంది.. ఈ నేపథ్యంలోనే తాజాగా పూజ హెగ్డే గురించి ఒక వార్త వినిపిస్తోంది. అదేంటంటే..అవకాశాలు లేక పూజ హెగ్డే 74 ఏళ్ల హీరోతో రొమాన్స్ చేయడానికి రెడీ అయింది అంటూ కోలీవుడ్ మీడియాలో ఒక రూమర్ వినిపిస్తోంది.మరి ఇంతకీ పూజ హెగ్డే ఎవరితో రొమాన్స్ చేయబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం.. చాలా రోజుల నుండి అవకాశాల కోసం వెతుకులాడుతున్న పూజ హెగ్డే కి సూర్య సినిమాలో అవకాశం వచ్చిన సంగతి మనకు తెలిసిదే.. ఇక ఈ సినిమాలో చేస్తుండగానే పూజా హెగ్డే కి మరో అవకాశం కూడా వచ్చిందట. అది కూడా 74 ఏళ్ల హీరో తో.. అసలు విషయం ఏమిటంటే రజినీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో కూలి సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాలో నాగార్జున కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. 


అయితే ఎన్నో అంచనాలతో లోకేష్ దర్శకత్వంలో వహిస్తున్న కూలి సినిమా గురించి ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే కూలి సినిమాకి సంబంధించి కోలీవుడ్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.అదేంటంటే రజినీకాంత్ హీరోగా చేస్తున్న కూలి సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఒక స్టార్ హీరోయిన్ ని తీసుకోవాలి అని చిత్ర యూనిట్ ఆలోచన చేసిందట.. దాంతో వెంటనే పూజ హెగ్డే రజినీకాంత్ తో స్టెప్పులు వేయడం కోసం తీసుకోవాలి అని ఫిక్స్ అయ్యారట.ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో రజినీకాంత్ తో పూజ హెగ్డే ఐటెం సాంగ్ చేయబోతుంది అనే వార్త ఎక్కువగా వినిపించడంతో బుట్ట బొమ్మ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి నిజంగానే పూజా హెగ్డే రజినీకాంత్ తో స్టెప్పులు వేస్తుందా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే ఇక రజినీకాంత్ చేస్తున్న కూలి మూవీలో సత్యరాజ్,నాగార్జున, ఉపేంద్ర తో పాటు శృతిహాసన్ వంటి భారీ తారాగణం నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: