
ఇటీవల కాలంలో పెద్దగా సినిమాలు చేయడం లేదు సమంత . అంతేకాదు ఆమె ఎక్కువగా లవ్ కి సంబంధించిన కొటేషన్ కోట్స్ ఎక్కువగా పెడుతూ ఉండడంతో సమంత త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. సమంత పెడుతున్న సందేశాలు చూసి ఆమె రెండో పెళ్ళికి సిద్ధమైందని హింట్ ఇస్తున్నట్లు జనాలు మాట్లాడుకుంటున్నారు . కాగా బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమూరుతో ఆమె ప్రేమలో ఉంది అనే టాక్ నడుస్తుంది . దానికి తగ్గటే వాళ్ల పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
సీక్రెట్ గా వీరు డేటింగ్ చేస్తున్నారు అంటూ కూడా తెలుస్తుంది. రీసెంట్గా సోషల్ మీడియాలో ఆమె ఒక పోస్ట్ పెట్టింది . "నిన్ను ప్రేమించాలంటే భయమేస్తుంది . జీవితాంతం నా చెయ్యి పట్టుకొనే ఉంటావా ..?" అని అర్థం వచ్చేలా ఒక పోస్ట్ పెట్టింది . దీనితో సోషల్ మీడియాలో ఇప్పుడు సమంత రెండో పెళ్లి వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . ఈమె గతంలో తన లైఫ్ లో జరిగిన అనుభవాలను బేస్ చేసుకుని పోస్ట్ పెట్టి ఉంటుంది అని.. నాగచైతన్యతో ప్రేమ పెళ్లి ఎంత దారుణంగా మారిపోయిందో అందరికీ తెలిసిందే . ఇప్పుడు దర్శకుడు రాజ్ తో కూడా ఈ విధంగానే మారిపోతుందా..? లేకపోతే ఆమె తీసుకునే డేసిషన్ కరెక్టేనా..? అనే విధంగా ఆమె కోట్ పెట్టింది అని మాట్లాడుకుంటున్నారు . ఒకే ఒక్క దెబ్బతో సోషల్ మీడియాలో సమంత రెండో పెళ్లి వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!