సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో టాలీవుడ్ లో పాపులర్ నటిగా పేరు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం సీనియర్ హీరోల సరసన కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఈ ముద్దుగుమ్మ సంక్రాంతికి వస్తున్నాం మూవీ లో భాగ్యం పాత్రలో ఎంత బాగా ఒదిగిపోయి నటించిందో చెప్పనక్కర్లేదు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసినట్టు ఎంతో అద్భుతంగా నటించింది.ముఖ్యంగా టాలీవుడ్ సీనియర్ హీరోల సరసన భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్ అద్భుతంగా నటిస్తుంది అనే విధంగా పేరు తెచ్చుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ పెళ్లి గురించి తాజాగా ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఐశ్వర్య రాజేష్ తల్లి నాగమణి. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగమణి తన కూతురు పెళ్లి గురించి మాట్లాడుతూ.. మా కూతురికి ప్రస్తుతం మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి.

కానీ తెలుగులో కంటే ఎక్కువగా తమిళంలోనే మా కూతురికి పేరు ఉంది.ఇక తెలుగు వాళ్ళు కూడా మా అమ్మాయిని ఇంకా బాగా ఆదరించాలని మేము కోరుకుంటున్నాం.ఇలాగే ఆమెకు మంచి విజయాలు అందించాలని నేను ఆశిస్తున్నాను. అలాగే అన్నీ కుదిరితే వచ్చే ఏడాది మా అమ్ములు పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాం అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఐశ్వర్య రాజేష్ ని ఇంట్లో అందరూ అమ్ములు అని పిలుస్తారట. అందుకే నాగమణి అమ్ములు అని పిలిచింది. ఇక ఐశ్వర్య రాజేష్ కి ప్రస్తుతం పెళ్లి సంబంధాలు చూస్తున్నామని మంచి సంబంధం వస్తే వచ్చే ఏడాది కచ్చితంగా పెళ్లి చేస్తాం అంటూ నాగమణి చెప్పింది.

ఇక ఐశ్వర్య రాజేష్ తల్లి కూడా ఇండస్ట్రీ కి చెందిందే.ఆమె ఇండస్ట్రీలో ప్రముఖ డాన్సర్ గా వ్యవహరించింది. అలాగే ఐశ్వర్య తండ్రి రాజేష్ అప్పట్లో స్టార్ హీరో. ఇక ఈయన స్టార్డంను తట్టుకోలేని కొంత మంది కావాలనే తొక్కేసారు అని అంటుంటారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో ఐశ్వర్య తల్లి తన భర్త ఒక్కసారిగా కింద పడటం చూసి ఆయనకి ఎవరైనా చేతబడి చేశారు కావచ్చు అని నాకు అనుమానం వచ్చిందని,ఇప్పుడికి కూడా ఆ అనుమానం నాలో పోలేదు అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: