తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో ఆది సాయి కుమార్ ఒకరు. ఈయన సాయి కుమార్ నట వారసుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇకపోతే ఈయన ప్రేమ కావాలి అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత ఈ నటుడు లవ్ లీ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా ఈయన నటించిన మొదటి రెండు సినిమాలు మంచి విజయాలను సాధించడంతో ఈయన అద్భుతమైన స్థాయికి చేరుకుంటాడు అని చాలా మంది భావించారు. కానీ లవ్ లీ మూవీ తర్వాత ఇపటి వరకు ఈయన ఎన్నో సినిమాల్లో నటించిన ఈయనకు ఏ సినిమా కూడా గొప్ప విజయాన్ని అందించలేదు. దానితో ఈయన కెరియర్ చాలా డౌన్ లో కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆది సాయి కుమార్ "ఎస్సై యుగంధర్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతోంది.

ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కాక ముందే ఈ మూవీ కి నాన్ థియేటర్ హక్కుల ద్వారా అదిరిపోయే రేంజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఎస్సై యుగంధర్ మూవీ యొక్క నాన్ థియేటర్ హక్కులను ఈటీవీ విన్ సంస్థ వారు ఏకంగా 7 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఆది సాయి కుమార్ హీరో గా రూపొందుతున్న ఎస్సై యుగేందర్ మూవీ కి నాన్ ధియేటర్ హక్కుల ద్వారానే భారీ ఎత్తున బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: