యంగ్ క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ మూవీ షూటింగ్ చాల వేగంగా జరుగుతోంది. స్వాతంత్రం రాకముందు జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా భారీ బడ్జెట్ తో నిర్మాణం జరపుకుంటున్న ఈమూవీ పై ప్రభాస్ చాల మనసు పెట్టి చేస్తున్నాడు. ఒకవైపు ‘రాజాసాబ్’ మూవీ షూటింగ్ కొనసాగిస్తూనే మరొకవైపు ప్రభాస్ ఈమూవీ అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు.



ఈమూవీ కథ రీత్యా అత్యంత కీలకమైన ఒక యువరాణి పాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఈపాత్ర కోసం అలియా భట్ ను సంప్రదిస్తే ప్రస్తుతం తాను వరస సినిమాలతో బిజీగా ఉండటంతో ప్రభాస్ ఈమూవీ షూటింగ్ కోసం బ్రేక్ లేకుండ తన డేట్స్ ఇచ్చి సహకరిస్తే తాను ఈమూవీలో యువరాణి పాత్ర చేయడానికి తనకు అభ్యంతరం లేదు అని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.



ఈ యువరాణి పాత్ర ఈమూవీ కథలోని కీలక మలుపుకు సహకరిస్తుందని అందువల్ల బాలీవుడ్ తో పాటు తెలుగు రాష్ట్రాలలో అలియా భట్ కు ఉన్న క్రేజ్ రీత్యా ఈపాత్రలో నటిస్తే మార్కెట్ పరంగా మరింత క్రేజ్ ఏర్పడే ఆస్కారం ఉందని నిర్మాతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఈమూవీలో బాలీవుడ్ హీరోయిన్ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. కథ రీత్యా అలియ భట్ పాత్ర హీరోయిన్ కాకపోయినప్పటికీ ప్రభాస్ అలియాల మధ్య చాల కీలక సన్నివేశాలు ఉంటాయని వార్తలు వస్తున్నాయి.


ప్రభాస్ చాల నెమ్మదిగా సినిమాలు చేస్తాడని ప్రచారం ఉంది. అయితే డానికి భిన్నంగా ప్రభాస్ ఒకేసారి రెండు సినిమాలను చేస్తూ తన అభిమానులకు జోష్ ను కలిగిస్తున్న విషయం తెలిసిందే. చాలకాలం తరువాత ప్రభాస్ కామెడీ చేస్తున్న ‘రాజా సాబ్’ ఈ సంవత్సరం విడుదల అయితే వచ్చే సంవత్సరం సంక్రాంతికి ‘ఫౌజీ’ విడుదల అయ్యేలా ప్రభాస్ యాక్షన్ ప్లాన్ లో ఉన్నాడు అని అంటున్నారు. ఈవార్తలే నిజం అయితే ప్రభాస్ అభిమానులకు పండుగే అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: