
ఈ సినిమాకి గల ప్రత్యేక అంశం ఏమిటి అన్న విషయం పైన త్వరలోనే తెలియజేస్తామంటూ శివ కార్తికేయన్ తెలిపారు. ముఖ్యంగా అతని పాత్ర మాత్రం అసాధారణంగా ఉంటుందని చెప్పలేనని కూడా తెలిపారు..కథ నార్త్ ఇండియా ప్రజలకు సంబంధించి మొదలవుతుందని మదరాసి అనేది కూడా నార్త్ ఇండియన్స్ ను సూచిస్తుందని తెలిపారు శివ కార్తికేయన్. ఈ మధ్యకాలంలో ఈ పదం ఎక్కువగా ఉపయోగించలేదని కానీ ఈ సినిమా ఉత్తర భారతీయులు మనల్ని ఎలా చూస్తారనే అంశంతో ఉంటుందని తెలిపారు. అందుకే మదరాసి అనే టైటిలే కరెక్ట్ గా సరిపోతుందని భావించే సెట్ చేశామని తెలిపారు శివ కార్తికేయన్.
ఇందులో కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ నటిస్తూ ఉన్నది. అలాగే మాలీవుడ్ యాక్టర్ తో పాటుగా బీజు మీనన్, తదితరు నటీనటులు సైతం ఇందులో కీలకమైన పాత్రలు నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాది వేసవి కానుకగా రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని తమిళ్, తెలుగు ,కన్నడ ,మలయాళం వంటి భాషలలో కూడా విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట. సరైన సక్సెస్ లేక డైరెక్టర్ మురగదాస్ కూడా చాలా సతమతమవుతున్నారు. మరి ఈ సినిమాతో ఏ విధంగా గట్టేక్కుతారో చూడాలి.