పాన్ ఇండియా హీరోయిన్ గా దేశవ్యాప్తంగా ఇప్పుడు రష్మిక హవా నడుస్తోంది. ‘పుష్ప 2’ మూవీలో ఆమె నటనకు ప్రశంసలు లభించిన విషయం తెలిసిందే. ఈమూవీ దాదాపు 2 వేల కోట్ల కలక్షన్స్ మూవీగా మారి కొన్ని నెలల గ్యాప్ కూడ తీసుకోకుండానే లేటెస్ట్ గా విడుదలైన ‘ఛావ’ కలక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఈమూవీలో కూడ రష్మిక నటనకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.



మరొకవైపు దేశవ్యాప్తంగా ఆమెకు ఏర్పడిన క్రేజ్ రీత్యా రష్మికకు 5 కోట్లకు పైగా పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు అంటే ఆమె మ్యానియా ఏస్థాయిలో ఉందో అర్థం అవుతుంది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మంచి క్రేజ్ లో ఉన్న ఈమె అదృష్టం పై బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ ఇప్పుడు ఆశలు పెట్టుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.



ఒకప్పుడు 1000 కోట్ల కలక్షన్స్ హీరోగా పేరు గాంచిన సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వరస ప్లాప్ లతో సతమతమైపోతూ తన క్రేజ్ ను అంతా పోగొట్టుకున్నాడు. ఒకప్పుడు రంజాన్ సీజన్ హీరోగా జండస్ట్రీ రికార్డ్ లు క్రియేట్ చేసిన ఈ కండల వీరుడు సినిమాల పై సగటు ప్రేక్షకులలో పెద్దగా ఆశక్తి లేదు. ఇలాంటి పరిస్థితులలో మురగా దాస్ దర్శకత్వంలో సల్మాన్ హీరోగా నటిస్తున్న ‘సికిందర్’ మూవీ ఏప్రియల్ లో రాబోతున్న రంజాన్ పండుగనాడు విడుదల కావలసి ఉంది.



దర్శకుడు మురగ దాస్ త్వరలో రాబోతున్న రంజాన్ సీజన్ కు ఈమూవీని విడుదలచేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ మొవ్వవ గ్రాఫిక్ వర్క్స్ లో జరుగుతున్న ఆలస్యం వల్ల ‘సికిందర్’ కు రంజాన్ సీజన్ కు రావడం కష్టమే అన్న వార్తలు బాలీవుడ్ మీడియా వ్రాస్తోంది. దీనితో రష్మిక అదృష్టం సల్మాన్ ఖాన్ ‘సికిందర్’ ను రక్షించి తిరిగి తమ హీరోను టాప్ హీరోగా నిలబెదుతుందని సల్మాన్ అభిమానులు ఆశపడుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: