విక్టరీ వెంకటేష్ హీరో గా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఈ సంవత్సరం జనవరి 14 వ తేదీన విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 35 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. దానితో ఈ సినిమా ఐదు వారాల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. మరి ఈ ఐదు వారాల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ , అలాగే ఇప్పటి వరకు ఈ మూవీ కి వచ్చిన లాభాల వివరాలను తెలుసుకుందాం.

ఐదు వారాల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 42.74 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 19.12 కోట్లు , ఉత్తరాంధ్రలో 22.53 కోట్లు , ఈస్ట్ లో 13.77 కోట్లు , వెస్ట్ లో 9 కోట్లు , గుంటూరు లో 10.40 కోట్లు , కృష్ణ లో 9.66 కోట్లు , నెల్లూర్ లో 4.85 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి ఐదు వారాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 132.07 కోట్ల షేర్ ... 214.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక ఐదు వారాల్లో ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపు కొని 9 కోట్లు , ఓవర్సీస్ లో 17 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఐదు వారాల్లో ఈ మూవీ కి 158.07 కోట్ల షేర్ ... 273.55 కోట్ల క్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ 42.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగగా ... ఈ మూవీ ఇప్పటికే 115.57 కోట్ల లాభాలను అందుకొని అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: