
హీరోయిన్ రష్మిక మందన్నా లెవెల్ మారిపోయింది అని ..ఆమె నటన ఆమె ఎక్స్ప్రెషన్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి అని హీరోయిన్ రష్మిక మందన్నా ఇప్పుడు ఇండస్ట్రీలో తోపైన హీరోయిన్ అంటూ మాట్లాడుకుంటున్నారు . కొందరు ఆమెని బీట్ చేసే వాళ్లు లేరు అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు. కాగా ఇప్పుడు సినీ చరిత్రలోనే హీరోయిన్ రష్మిక మందన్నా ఒక రేర్ రికార్డ్ నెలకొల్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . రీసెంట్గా ఆమె నటించిన సినిమా "చావా".
ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అంతేకాదు హీరోగా విక్కీ కౌశల్ ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడో.. హీరోయిన్గా రశ్మిక మందన్నా కూడా అంతా మంచి పేరు సంపాదించుకుంది . రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. రష్మిక మందన్నా.. ఈ సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంది అనే వార్త వైరల్ గా మారింది . రష్మిక మందన్నా ఈ సినిమా కోసం 17 కోట్లు ఛార్జ్ చేసిందట . మేకర్స్ అంతా ఇచ్చేసుకున్నారట . దానికి కారణం రష్మిక క్రేజే కాదు ..రష్మిక ఈ సినిమా కోసం తీసుకున్న రిస్క్ అంటూ కూడా తెలుస్తుంది . ఇప్పటివరకు సినిమా చరిత్రలో ఏ హీరోయిన్ కూడా 17 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న దాఖలాలు లేవు . అలాంటి ఒక క్రేజీ రికార్డ్ నెలకొల్పింది రష్మిక మందన్నా..!