
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .
టాలీవుడ్ లో కొందరు హీరోలు వారసులు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ .. దివంగత సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు .. అలాగే సీనియర్ ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ .. ఇప్పుడు ఆయన తనయుడు నందమూరి మోక్షజ్ఞ కూడా సినిమా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో తర్వాత తరం వారసులలో భారీ అంచనాలు ఉన్న వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరానందన్ తో పాటు మహేష్ బాబు తనయుడు గౌతమ్ .. అలాగే విక్టరీ వెంకటేష్ తనయుడి సినిమా ఎంట్రీ పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మరో బిగ్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ ఎంట్రీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా అకిరా నందన్ టాలీవుడ్ ఎంట్రీపై ఇప్పుడు వరకు చాలా ఊహాగానాలు వినిపిస్తూనే వచ్చాయి. ఓ పక్క సంగీతం పరంగా థమన్ ఓజి సినిమా కోసం అకిరాతో వర్క్ చేస్తా అని ఇప్పటికే చెప్పేశాడు. అయితే హీరో గా .. నటుడుగా అకీరా ఎప్పుడు ? డెబ్యూ ఇస్తాడు అనేది ఇప్పుడు తెలుస్తోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం అకిరా వచ్చే మరో రెండేళ్ల తర్వాత వెండి తెర పై హీరోగా పరిచయం కాబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా మెగా అభిమాను లతో పాటు పవన్ అభిమానులు ఇంకో రెండేళ్లు అకిరా కోసం ఆగాల్సిందే అని చెప్పాలి. మరి చూడాలి అఖీరా నందన్ సినిమా ఎంట్రీ ఎవరితో ఎలా ఉంటుంది అనేది.