టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేశారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది.

దానితో ఈ సినిమా పెద్ద స్థాయిలో కలెక్షన్లను వసూలు చేయలేక పోయింది. ఇకపోతే ఓ విషయంలో మాత్రం గేమ్ చేంజర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తా చాటుకుంది. విడుదల అయిన తర్వాత పది రోజుల పాటు గేమ్ చేంజర్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్ లను వసూ చేసింది. ఇకపోతే తాజాగా నాగ చైతన్య "తండెల్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... చందు మండేటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఫిబ్రవరి 7 వ తేదీన తెలుగు తో పాటు తమిళ్ , హిందీ భాషలలో విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి మంచి ఓపెనింగ్లు కూడా లభించాయి.

ప్రస్తుతం కూడా ఈ మూవీ కి మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇకపోతే ఈ సినిమా కూడా విడుదల అయిన తర్వాత పది రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. దానితో ఈ సంవత్సరం పది రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్ లను వసూలు చేసిన సినిమాల లిస్టు లో గేమ్ చేంజర్ , తండెల్ నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nc