
అయితే ఎప్పుడు కూడా నెగిటివిటీ పై నెగటివ్ ట్రోల్లింగ్ పై సమంత స్పందించింది లేదు. తన పని తాను చూసుకుంటూ పోయింది. అయితే ఆమె కి సినిమా అవకాశాలు కూడా వస్తున్న సినిమాలలో నటించడం లేదు . సినిమాలను పూర్తిగా తగ్గించేసింది . కానీ ఆమె చేసిన సిటాడిల్ సిరీస్ మాత్రం జనాలను బాగా ఆకట్టుకుంటుంది అంటూ ఆశపడింది. నవంబర్ 6 నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతూ వచ్చింది. ఈ సిరీస్ అనుకున్నంత హిట్ కాలేకపోయింది . సమంత దీనికోసం ఎన్ని రిస్కీ ఫైట్స్ చేసింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు .
కాగా ఇప్పుడు ఆమె కష్టానికి తగ్గ ఫలితం దక్కింది . ఈ సిరీస్ కి ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. 2020 లో ఏర్పాటు అయిన ఐకానిక్ గోల్డ్ అవార్డ్స్ హిందీ చిత్ర రంగంతో పాటు టెలివిజన్ రంగంలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సినిమాలకి వెబ్ సిరీస్ లకి రకరకాల విభాగంలో అవార్డులు ఇస్తూ వస్తుంది . తాజాగా ఐకానిక్ గోల్డెన్ అవార్డ్స్ లో "సిటాడిల్" వెబ్ సిరీస్ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. సమంత కష్టానికి తగ్గ ఫలితం ఇన్నాళ్లకు దక్కింది అని .. సిరీస్ రిలీజ్ అయిన తర్వాత ఎవరు కూడా సిటాడిల్ వెబ్ సిరీస్ గురించి ఇలా మాట్లాడుకోలేదు అని .. ఇప్పుడే ఆమె కష్టానికి తగ్గ ఫలితం దక్కింది అంటున్నారు సమంత ఫ్యాన్స్..!