
కాగా రీసెంట్గా నటించిన "చావా" సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. బాక్స్ ఆఫీస్ చరిత్రను తిరగరాసింది. ఇలాంటి క్రమంలోనే రష్మిక మందన్నా పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. హీరో విజయ్ దేవరకొండతో రష్మిక మందన్నా డేటింగ్ చేస్తుంది అన్న వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి . దానికి తగ్గట్టే వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోస్ ఒకే బ్యాక్ గ్రౌండ్ లో దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ వచ్చాయి.
రీసెంట్గా రష్మిక మందన్నా తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటో అప్లోడ్ చేసింది . తనకు వచ్చిన పూల బొకేని స్టోరీలో అప్లోడ్ చేస్తూ .."నా ముఖంపై చిరునవ్వు ఎలా తెప్పించాలి అనేది నీకు తెలిసినంతగా ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు "అంటూ ఒక క్యాప్షన్ పెట్టింది . ఇది కచ్చితంగా విజయ్ దేవరకొండ గురించే అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు . విజయ్ దేవరకొండ రష్మికల జంట బాగుంటుంది అని.. వీళ్ళు ఇలా దొంగచాటు ప్రేమలో ఆపేసి డేటింగ్ విషయాన్ని ఓపెన్ గా చెప్పేస్తే బాగుంటుంది అని మాట్లాడుకుంటున్నారు జనాలు . సోషల్ మీడియాలో ఇప్పుడు హీరోయిన్..నేషనల్ క్రష్ గా పాపులారిటి సంపాదించుకున్న రష్మిక మందన్నా పెట్టిన పోస్ట్ బాగా ట్రెండ్ అవుతుంది..!