టాలీవుడ్ యువ నటుడు సందీప్ కిషన్ తాజాగా మజాకా అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుండగా ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి త్రినాద్ రావు నక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథను అందించాడు.

మూవీ ని ఫిబ్రవరి 26 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను ఫుల్ స్పీడులో పూర్తి చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఈ మూవీ యొక్క రన్ టైమ్ ను కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని 2 గంటల 29 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ పర్ఫెక్ట్ రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు ఈ మూవీ నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై జనాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sk