ఏంటి ఆ బాలీవుడ్ హాట్ బ్యూటీ కి హీరోయిన్ ప్రియమణి తండ్రి కి మధ్య నిజంగానే సంబంధం ఉందా.. మరి వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. ప్రియమణి ఇండస్ట్రీ లో సీనియర్ హీరోయిన్.. అయినప్పటికీ అవకాశాలకు మాత్రం కొదువే లేదు. ఈ హీరోయిన్ తన నటన తో నేషనల్ అవార్డు ను సైతం అందుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ పెళ్లయ్యాక కూడా ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు సినిమాల్లో నటిస్తోంది.  అలా సీనియర్ హీరోలకు సరసన నటించడమే కాకుండా వాళ్ళ సినిమాల్లో కీ రోల్స్ కూడా చేస్తోంది. అలాగే పలు వెబ్ సిరీస్ లలో కూడా ప్రియమణి నటిస్తోంది. అయితే అలాంటి ప్రియమణి కి సీనియర్ నటి విద్యా బాలన్ కి మధ్య రిలేషన్ ఉందట. 

అదేంటంటే విద్యాబాలన్ ప్రియమణి కి వరుసకు అక్క అవుతుందట. అదేలా అంటే ప్రియమణి విద్యాబాలన్ మధ్య రిలేషన్ ఎలా ఏర్పడిందంటే.. విద్యాబాలన్ ప్రియమణి తండ్రి తరఫున బంధువుల అమ్మాయి అట..అలా తనకు వరుసకు అక్క అవుతుంది అని ప్రియమణి ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది. అయితే మా ఇద్దరి మధ్య బంధుత్వం ఉన్నప్పటికీ మేమిద్దరం కలుసుకుంది చాలా తక్కువ అని, కేవలం రెండుసార్లు మాత్రమే విద్యాబాలన్ నేను కలుసుకున్నాం అంటూ ప్రియమణి ఓ ఇంటర్వ్యూ లో చెప్పింది. 

అలాగే ఓ అవార్డుల ఫంక్షన్లో విద్యాబాలన్ గారు నాకు అవార్డు అందజేశారు. ఆ సమయంలో ఒకసారి కలుసుకున్నాం. ఆ తర్వాత బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ బర్త్డే రోజు మరోసారి కలుసుకున్నాం. అలా మా మధ్య బంధుత్వం ఉన్నప్పటికీ మేమిద్దరం కలుసుకుంది మాత్రం కేవలం రెండుసార్లే అంటూ ప్రియమణి చెప్పుకొచ్చింది.అలా తన తండ్రి బంధువుల తరపున విద్యాబాలన్ తనకు వరసకు అక్క అవుతుంది అని ప్రియమణి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది

మరింత సమాచారం తెలుసుకోండి: