తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో నాగ చైతన్య ఒకరు. జోష్ మూవీ తో నటుడిగా కెరియర్ను మొదలు పెట్టిన చైతూ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి చాలా విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా తనకంటూ ఒక మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే నాగ చైతన్య , సాయి పల్లవి కాంబోలో ఇప్పటి వరకు రెండు సినిమాలు వచ్చాయి. మొదటగా వీరి కాంబినేషన్లో లవ్ స్టోరీ అనే సినిమా వచ్చింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమాలో నాగ చైతన్య , సాయి పల్లవి జంటకు కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి. ఇకపోతే లవ్ స్టోరీ మూవీ విడుదల అయిన కొన్ని సంవత్సరాలకు వీరి కాంబోలో తండెల్ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాకు చందు మండేటి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం ఫిబ్రవరి 7 వ తేదీన తెలుగు , తమిళ్ , హిందీ భాషలలో విడుదల అయింది. ఈ సినిమాకు కూడా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి టాక్ రావడంతో ప్రస్తుతం ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు దక్కుతున్నాయి. ఈ సినిమాలో కూడా నాగ చైతన్య , సాయి పల్లవి జంటకు మంచి ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి దక్కుతున్నాయి.

ఇకపోతే తాజాగా నాగ చైతన్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఆయన సాయి పల్లవి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తాజా ఇంటర్వ్యూ లో నాగ చైతన్య మాట్లాడుతూ ... సాయి పల్లవి తో నటించడం చాలా బాగుంటుంది. ఆమెతో డాన్స్ చేయడం మరింత ఆనందంగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలి అంటే ఆమెతో డాన్స్ చేయడం వల్లే నా డాన్స్ ఇంప్రూవ్ అయింది అని నాగ చైతన్య తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nc