
దీంతో ఒక మైక్ లోగో తగిలి మనోజ్ కంటికి స్వల్ప గాయం అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మన మీడియాతో ఎటువంటి విషయాలు మాట్లాడుకోకుండా వెళ్లిపోయారట. దీంతో రాత్రి పోలీసులకు సైతం మంచు మనోజ్ కి మధ్య ఒక వాగ్వాదం చోటు చేసుకున్నదని పెట్రోలింగ్లో భాగంగా భాకరపేట ఒక గెస్ట్ హౌస్ లో తనిఖీ చేయక ఎస్సై, మనోజ్ మధ్య గొడవ జరిగిందనే విధంగా వార్తలు వినిపించాయి. ఆ రాత్రి జరిగిన ఒక ఘటన పైన కూడా మనోజ్ వీడియోని రిలీజ్ చేశారు.
ఆ వీడియోలో మనోజ్ మాట్లాడుతూ తాను ఎలాంటి తప్పు చేయలేదని ఎక్కడా కూడా మిస్ బిహేవియర్ గా మాట్లాడలేదని తాను చట్టానికి అనుకూలంగానే సహకరించాను అంటూ తెలిపారు.. పోలీసుల తనపైకి వచ్చి దురుసుగా ప్రవర్తించారని.. ముందు సీఎం దగ్గర నుంచి వచ్చానని చెప్పి మరి భయపెట్టించే ప్రయత్నం చేశారంటూ తెలిపారు. సీఎం గారి పేరు ఎందుకు చెప్పాలని పోలీసులను సైతం నిలదీయడం జరిగిందట మంచు మనోజ్. సైరన్ వేసుకొని వచ్చి మరి రిసార్ట్లో పోలీసులు చాలా హంగామా చేశారు అంటూ తెలిపారు.. పోలీస్ కారులోనే తనని తీసుకువెళ్లారని తనని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అడగగా ఎస్సై సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారట. తన పైన కావాలని ఇబ్బంది పెడుతున్నారు అంటూ తెలిపారు మంచు మనోజ్.