రాజమౌళి అంటే ఎంతటి దిగ్గజ డైరెక్టరో చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన ధీరుడు.అయితే అలాంటి రాజమౌళి ఓ యాంకర్ తో రొమాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొట్టింది. మరి ఇంతకీ ఆ యాంకర్ ఎవరు? పెళ్లయిన రాజమౌళి మరో యాంకర్ తో రొమాన్స్ చేయడం ఏంటి అని చాలామంది అనుకుంటారు.అయితే ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏమీ లేదు. ఎందుకో ఇప్పుడు మనం చూద్దాం.. జబర్దస్త్ ద్వారా స్టార్ యాంకర్ గా మారిన రష్మీ అంటే అందరికీ గుర్తు ఉంటుంది.రష్మి గౌతమ్ కేవలం యాంకర్ గానే కాకుండా గతంలో కొన్ని సీరియల్స్ కూడా చేసింది. అలాగే సినిమాల్లో కూడా హీరోయిన్ గా,కీ రోల్స్ చేస్తోంది.అయితే అలాంటి రష్మీ సినిమాల్లో హీరోయిన్ కాకముందు యువ అనే సీరియల్లో కీరోల్ పోషించింది.అయితే ఈ సీరియల్ వచ్చిన సమయంలో రాజమౌళి విక్రమార్కుడు సినిమాకి దర్శకత్వం వహించారు.

 అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రాజమౌళి రష్మీ చేసిన యువ సీరియల్ లోకి గెస్ట్ గా వచ్చారు. అయితే ఒకప్పటి పాత వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.ఇక ఈ వీడియోలో ఏముందంటే.. రష్మీ గౌతమ్ రాజమౌళికి సైట్ కొడుతుంది.. దీంతో ఇన్ని రోజులు నీకు ఫోన్ చేసింది డైరెక్టర్ రాజమౌళినా అని మరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ షాక్ అవుతుంది. ఇక అక్కడికి వచ్చిన రాజమౌళికి సైట్ కొడుతున్న రష్మీ ఎఇన్ని రోజులు మీరేనా నాతో మాట్లాడింది అని రష్మీ అంటే రోజులు కాదు గంటలు..ఎందుకంటే నీతో అరగంటకు ఒక్కసారైనా మాట్లాడాలి కదా.. ఇద్దరి మధ్య కుచ్ కుచ్ హోతా హై  అని రాజమౌళి అంటారు.ఇక ఆయన మాటలకు రష్మీ మెలికలు తిరుగుతూ ఉంటుంది.

ఆ టైంలోనే రొమాంటిక్ గా ఒక చూపు చూస్తుంది. దానికి రాజమౌళి చెప్పు అని అడగగా ఆమె నా చూపుతో మీకు ఇంకా అర్థం అవ్వడం లేదా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటూ చెబుతుంది.ప్రస్తుతం రాజమౌళికి రష్మీ సైట్ కొట్టిన అప్పటి వీడియో ఇప్పుడు నెట్టెంట చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజెన్స్ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. రష్మీ రాజమౌళి మధ్య కుచ్ కుచ్ హోతా హై అని, రష్మీ రాజమౌళితో రొమాంటిక్ ఇరగదీసింది అని ఇలా సోషల్ మీడియాలో ఈ వీడియో పెట్టి తెగ వైరల్ చేస్తున్నారు. ఇక రష్మితో రాజమౌళి విక్రమార్కుడు మూవీ ప్రమోషన్స్ కోసం ఇలా చేసినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: