
బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని ఫామ్ లో ఉన్న నందమూరి నటసింహం బాలకృష్ణ డాకూ మహారాజ్ సినిమా తో వరుసగా నాలుగో విజయం తన ఖాతాలో వేసుకున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖఃడ నుంచి బాలయ్య కు వరుసగా నాలుగు హిట్లు పడ్డాయి. అఖండ – వీరసింహారెడ్డి తర్వాత వచ్చిన భగవంత్ కేసరి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవడంతోపాటు 30 సంవత్సరాల తర్వాత బాలయ్యకు మూడు వరుస విజయాలు అందించిన సినిమా గా చరిత్రలో నిలిచి పోయింది. ఇదిలా ఉంటే ఓ సింగిల్ థియేటర్లో బాలయ్య నటించిన పై మూడు సినిమాలు సెంచరీలు కొట్టేశాయి.
భగవంత్ కేసరి డైరెక్టుగా 12 కేంద్రాలు.. షిఫ్టులతో కలిపి మరో 5 సెంటర్లు.. మొత్తం 17 కేంద్రాల్లో 50 రోజులు ఆడగా .. ఓ థియేటర్లో డైరెక్టుగా రోజూ 4 ఆటలతో సెంచరీ కొట్టింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ సినిమా రెండు వారాలు ఒక థియేటర్లో 4 ఆటలతో ఆడితేనే గ్రేట్ అన్నట్టుగా ఉంది. అలాంటిది 100 రోజుల పాటు కంటిన్యూ గా 4 ఆటలతో 100 రోజులు ఆడడం అంటే సెన్షేషనల్ రికార్డే అని చెప్పాలి. పల్నాడు జిల్లాలోని
చిలకలూరిపేటలో రామకృష్ణా థియేటర్లో ఈ సినిమా 175 రోజులు ఆడింది.
ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో ఇప్పట్లో ఏ హీరోకు లేని అరుదైన రికార్డు కూడా నటసింహం బాలయ్య సొంతం అయ్యింది. చిలకలూరిపేట ఇదే రామకృష్ణా థియేటర్లో బాలయ్య నటించిన చివరి మూడు హ్యాట్రిక్ విజయాలు సినిమాలు సెంచరీ కొట్టాయి. అఖండ 181 రోజులు – వీరసింహారెడ్డి 106 రోజులు.. భగవంత్ కేసరి 175 రోజులు ఆడాయి. ఇక డాకూ మహారాజ్ కూడా 50 రోజుల దిశగా పరుగులు పెడుతోంది.