- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ వ‌రుస ప్లాపుల త‌ర్వాత అఖండ సినిమా తో ఒక్క‌సారి గా బ్యాక్ బౌన్స్ అయ్యారు. అఖండ సినిమా బాల‌య్య కెరీర్ కు సెకండ్ ఇన్నింగ్స్ లో అదిరిపోయే బూస్ట‌ప్ ఇచ్చింది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌కత్వంలో సింహా , లెజెండ్ సినిమా ల త‌ర్వాత అఖండ హ్యాట్రిక్ హిట్ సినిమా గా నిలిచింది. అఖండ సినిమా నాలుగు కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా క‌ర్నూలు జిల్లా ఆదోని – రాజ్‌, ఎమ్మిగ‌నూరు – శ్రీనివాస , కోయిల‌కుంట్ల – ఏవీఆర్ థియేట‌ర్ల‌తో పాటు చిల‌కలూరిపేట రామ‌కృష్ణ థియేట‌ర్ల లో అఖండ 100 రోజులు పూర్తి చేసుకుంది. సినిమా శ‌త‌దినోత్స‌వ వేడుక‌ల లో హీరో బాల‌కృష్ణ పై నాలుగు థియేట‌ర్ల మాజ‌మాన్యాల‌కు స్వ‌యంగా షీల్డులు అంద‌జేశార‌వు.


ఏదేమైనా సీడెడ్ అంటేనే బాల‌య్య సినిమాల‌కు కంచుకోట లాంటిది. అందులోనూ క‌డ‌ప తో పాటు క‌ర్నూలు జిల్లాల్లో బాల‌య్య సినిమాలు ప్లాప్ అయినా కూడా సెంచ‌రీ కొట్టేస్తూ ఉంటాయి. ఇక అఖండ సినిమా తో క‌ర్నూలు జిల్లా బాల‌య్య అడ్డా అన్న విష‌యం మ‌రోసారి ఫ్రూవ్ అయ్యింది. గ‌తంలో ఇదే జిల్లాలోని ఎమ్మిగ‌నూరులోనే బాల‌య్య లెజెండ్ ఏకంగా 400కు పైగా రోజుల పాటు ఆడి రికార్డు క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇది సెన్షేష‌నల్ రికార్డు.


అలాగే అఖండ ఏపీ, తెలంగాణ‌లో 103 కేంద్రాల్లో 50 రోజుల పండ‌గ జ‌రుపుకుంది. ఓవ‌రాల్‌గా ఈ సినిమా 106 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. ఇక ప‌ల్నాడు జిల్లాలో ఉన్న చిల‌క‌లూరిపేట ఎప్పుడూ నంద‌మూరి ఫ్యామిలీ సినిమాల‌కు అడ్డా . . అక్క‌డ బాల‌య్య ప్లాప్ సినిమా ల‌య‌న్ తో పాటు క‌ళ్యాణ్‌రామ్ బ్లాక్‌బస్ట‌ర్ ప‌టాస్ సినిమాలు కూడా సెంచ‌రీ కొట్టేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: