- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

మహేష్ బాబు బాల నటుడుగా ఎన్నో సినిమాలలో నటించారు. తన తండ్రితో పాటు అన్నయ్య రమేష్ బాబు తో కలిసి ఎన్నో సినిమాలలో నటించారు. 1999లో కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమాతో మహేష్ బాబు హీరోగా తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. రాజకుమారుడు సినిమా 45 కేంద్రాలలో వంద రోజులు ఆడింది. ఆ తర్వాత వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన యువరాజు మహేష్ బాబు రెండో సినిమా. ఈ సినిమా అంచనాలు అందుకోలేదు. అయినా కూడా 17 కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఇక మహేష్ బాబు మూడో సినిమా బిగోపాల్ దర్శకత్వంలో వచ్చిన వంశీ. ఈ సినిమా డిజాస్టర్ అయింది.


పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై సూపర్ స్టార్ కృష్ణ స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో మహేష్ బాబు కి జోడిగా నటించిన మాజీ మిస్ ఇండియా న‌మ‌త్రా శిరోద్క‌ర్ నే ఆ తర్వాత మహేష్ బాబు ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మహేష్ కెరీర్ లో నాలుగో సినిమా మురారి. క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తర్కెక్కిన ఈ సినిమాను సీనియర్ నిర్మాత నందిగం రామలింగేశ్వర రావు నిర్మించారు. ఆయన సూపర్ స్టార్ కృష్ణతో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించారు. మురారి సినిమాకు మంచి టాక్ వచ్చిన లెంగ్త్ బాగా ఎక్కువైందన్న టాక్ వచ్చింది.


సినిమాని నిడివి తగ్గించేందుకు దర్శకుడు కృష్ణవంశీ ఒప్పుకోలేదు. అందుకే ఈ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. 34 కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకున్న మురారి సినిమా మూడు కేంద్రాలలో 175 రోజులు ఆడింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్లో అలాగే కృష్ణా జిల్లాలోని రెండు థియేటర్లలో 175 రోజులు పూర్తి చేసుకుంది. మచిలీపట్నం రామ్ శాంతి థియేటర్ తో పాటు విజయవాడలోని విజయకృష్ణ థియేటర్లో మురారి 175 రోజులు పూర్తి చేసుకుంది. మొత్తం మూడు కేంద్రాలలో 175 రోజులు ఆడిన మురారి .. ఒక కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం విజయవాడ సెంటర్లలో రెండు చోట్ల ఈ అరుదైన ఘనత సాధించడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: