డైరెక్టర్ శ్రీను వైట్ల తెలుగు ఇండస్ట్రీలో ఈయన తెలియని వారు ఉండరు... ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాంటి ఈయన ఎంతో మంది కొత్త హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసి స్టార్లుగా మార్చిన ఘనత కూడా ఉంది.. అలాంటి శ్రీనువైట్ల ప్రస్తుత స్టార్ హీరో అడవి శేష్ ను మాత్రం మోసం చేశారని చెప్పవచ్చు. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో డైరెక్ట్ గా చెప్పారు.. మరి ఆయనను ఏ విధంగా మోసం చేశారు వివరాలు చూద్దాం.. శ్రీను వైట్ల డైరెక్షన్ లో వచ్చినటువంటి 'సొంతం' చిత్రం తెలియని వారు ఉండరు.. 2002లో విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది... సినిమా కామెడీ పరంగా అందరిని మెప్పించింది.. 

ఈ మూవీలో సునీల్ కామెడీ చూస్తే నవ్వని వారు ఉండరు.. కేవలం సునీల్ పైన దృష్టి పెట్టి సినిమా మొత్తం డిజైన్ చేశారు శ్రీను వైట్ల. మిగతా క్యారెక్టర్స్ అన్నీ వదిలేశారు.. అలాంటి శ్రీనువైట్ల ఈ చిత్రంలో హీరో అడవి శేష్ కు మంచి పాత్ర ఉంటుందని, నీకు పెళ్లి చేస్తానని చెప్పారట.. దీంతో అది నమ్మిన అడవి శేష్ ఈ సినిమాలో చేయడానికి ఒప్పుకున్నాడు. తీరా షూటింగ్ సెట్లోకి వెళ్లాక ఆయన పాత్ర చాలా చిన్నదని తెలిసింది. మూడు రోజుల్లో మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసేసరికి షాక్ అయిపోయారు.. 

ఇందులో సెకండ్ హీరో పాత్రా అని చెప్పి చివరికి సినిమా క్లైమాక్స్ లో నమిత ను పెళ్లి చేసుకునే పెళ్ళి కొడుకు క్యారెక్టర్ మాత్రమే చేయిస్తాడు.. దీంతో చాలా హర్ట్ అయినటువంటి అడవి శేష్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ మూవీని చూడలేదట.. ప్రస్తుతం ఆయన స్టార్ హీరో అయ్యారు కాబట్టి ఈ విషయాన్ని డైరెక్ట్ గా బయట పెట్టడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: