- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

చెన్నై చిన్నది సీనియర్ హీరోయిన్ త్రిష‌ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. త్రిష ఎంతో మంది హీరో ల‌తో ఎఫైర్ లు నడిపిందన్న వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరో విజయ్ తో కూడా ఆమె ఎఫైర్ పెట్టుకుందని .. అలాగే టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తోను ఆమె ప్రేమాయణం నడిపి బ్రేకప్ చెప్పిందన్న వార్తలు ఉన్నాయి. దీని వెనక ఓ ఆసక్తికరమైన స్టోరీ కూడా ఉంది. త్రిష టాప్ హీరోగా ఉన్నప్పుడు తెలుగులో ప్రభాస్ తో డేటింగ్ చేసిందట .. అలాగే అటు తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న సమయంలో విజయ్ తో కూడా ఆమె రిలేషన్ మెయింటైన్ చేసింది. అలా రెండు పడవల ప్రయాణంలో ఓవైపు ప్రభాస్ మనవైపు విజయ్ ని మెయింటైన్ చేసిందన్న పుకారులు త్రిష విషయంలో వినిపించాయి. ప్రభాస్ కూడా త్రిష‌ను ఘాడంగా ప్రేమించాడని ... అయితే ఎప్పుడైతే విజయ్ - త్రిష రిలేషన్ బయటపడిందో అప్పటినుంచి ప్రభాస్ త్రిష ను పక్కన పెట్టేసాడు అన్న ప్రచారం వినిపించింది.


దీనికి తోడు త్రిష విజయ్ ఎప్పటికప్పుడు చెన్నైలో ప‌బ్బులు .. పార్టీలు అంటూ తిరుగుతూ మీడియాలో హైలెట్ అయ్యారు. ఈ క్రమంలోని విజయ్ ఒకరోజు త్రిష బర్తడే సందర్భంగా ఆమెకు కోటి రూపాయలు విలువచేసే డైమండ్ నెక్లెస్ కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు అన్న పుకార్లు వినిపించాయి. ఆ డైమండ్ రింగ్ స్వయంగా విజయ్ త్రిష వేలికి పెట్టాడట. ఈ విషయం మీడియాలో బాగా హైలైట్ అవ్వడంతో త్రిష - విజయ్ డేటింగ్ వార్తలు తమిళ ఇండస్ట్రీలో దుమారం సృష్టించాయి. చాలామంది త్రిష - విజయ్ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారన్న రూమ‌ర్లు క్రియేట్ చేశారు. ఈ క్రమంలోని విజయ్ తండ్రి డైరెక్టర్ చంద్రశేఖర్ త్రిష ఇంటికి వెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చి దర్శక నిర్మాతలకు కూడా తన కొడుకు సినిమాలలో త్రిష ని హీరోయిన్గా పెట్టుకోవద్దని వార్నింగ్‌ ఇచ్చారన్న ప్రచారం వినిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: