
ఈ వేడుకకు సైతం రాధిక ఆప్టే కనిపించింది. అయితే అక్కడ ఒక చేతిలో బ్రెస్ట్ మిల్క్ పంపింగ్ తో పాటుగా మరొక చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని ఫోటోలకు సైతం ఫోజులు ఇవ్వగా ఈ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో చాలామంది నెటిజన్స్ ఈమె చేసిన ఈ ఫోటో షేర్ కి తిట్టిపోస్తున్నారు.. కేవలం రెండు నెలల బిడ్డకు పాలు ఇస్తూ మద్యం తాగడం ఏంటి అంటూ రాధిక ఆప్టే పైన ఫైర్ అవుతూ చిన్నారి ఆరోగ్యానికి చాలా ప్రమాదం అంటూ తెలియజేస్తున్నారు. మరి కొంతమంది ఛీ ఇదేంపాడు అలవాటు అంటూ తిడుతూ ఉన్నారు.
తెలుగు తెరకు రక్త చరిత్ర సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ బాలకృష్ణతో లెజెండ్, తదితర చిత్రాలలో కూడా నటించింది. ఇమే నటించిన లాస్ట్ డేస్ అనే ఒక హాలీవుడ్ సినిమాలో కూడా నటించిన ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. 2012లో బ్రిటిష్ కంపోజర్ అయినటువంటి టేలర్ ను ఆమె వివాహం చేసుకుంది. అయితే వీరిది కూడా ప్రేమ వివాహమే. రాధిక ఆప్టే తెలుగులో రెండు మూడు చిత్రల తర్వాత మళ్లీ కూడా కనిపించలేదు. అంతేకాకుండా గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పైన కూడా పలు రకాల వ్యాఖ్యలు చేసింది రాధిక ఆప్టే.