తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని సంవత్సరాల క్రితం 100 కోట్ల కలెక్షన్లు వచ్చిన సినిమాలను అత్యంత భారీ విజయవంతమైన సినిమాలుగా చూసేవారు. కానీ ఎప్పుడు అయితే బాహుబలి సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి 1000 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసిందో అప్పటి నుండి తెలుగు సినిమా పరిశ్రమ స్థాయి పెరిగిపోయింది. మన స్టార్ హీరోలు నటించిన సినిమాలకు ఓపెనింగ్ డే నే వందల కోట్ల కలెక్షన్లు వస్తున్నాయి. ఇక మీడియం రేంజ్ హీరోలు చాలా మంది ఇప్పటికే వంద కోట్ల కలెక్షన్ల క్లబ్ లోకి చేరిపోయారు. 

ఇకపోతే ఓ హీరో ఏకంగా తొలి సినిమాతోనే 100 కోట్ల కలెక్షన్ల క్లబ్ లోకి చేరిపోయాడు. అతను ఎవరు అనుకుంటున్నారా ..? ఆయన మరెవరో కాదు పంజా వైష్ణవ్ తేజ్. ఈయన బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన అనే సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఏకంగా 100 కోట్లకు మించిన కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర రాబట్టింది. మొదటి సినిమాతోనే ఈ హీరో 100 కోట్ల క్లబ్ లోకి చేరడంతో ఈయనకు తిరుగులేదు అని చాలా మంది భావించారు. 

కానీ మొదటి సినిమాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈయనకు ఆ తర్వాతనే అసలైన కష్టాలు మొదలయ్యాయి. ఉప్పెన మూవీ తర్వాత ఈయన కొండ పొలం , రంగ రంగ వైభవంగా , ఆది కేశవ అనే సినిమా లతో ప్రేక్షకు లను పలకరించాడు. కానీ ఈయన నటించిన సినిమాలన్నీ వరుస పెట్టి అపజయాలను అందుకుంటున్నాయి. ఉప్పెన సినిమా తర్వాత చాలా మూవీల ద్వారానే ఈయన ప్రేక్షకులను పలకరించిన ఏ మూవీ కూడా ఈయనకు మంచి విజయాన్ని అందించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

pvt