
తన తల్లి నిర్ణయం ప్రకారం తాను వైవాహిక బంధంలోకి అడుగుపెట్టానని ఆమె పేర్కొన్నారు. కెరీర్ పరంగా రాణిస్తున్న తరుణంలో వివాహ బంధంలో అడుగుపెట్టానని శిల్పా శిరోద్కర్ తెలిపారు. 2000 సంవత్సరంలోనే నాకు పెళ్లి జరిగిందని ఆమె చెప్పుకొచ్చారు. ఏ వయస్సులో జరగాల్సిన ముచ్చట ఆ వయస్సులోనే జరగాలని మా అమ్మ నమ్ముతుందని శిల్పా శిరోద్కర్ వెల్లడించారు.
అలా కాని పక్షంలో ఏవో సమస్యలు వస్తాయని అమ్మ అనుకునేదని ఆమె పేర్కొన్నారు. అమ్మ నమ్మకం ప్రకారం 26 సంవత్సరాల వయస్సులోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టానని శిల్పా శిరోద్కర్ వెల్లడించారు. ఇండస్ట్రీని వదిలిపెట్టి పెళ్లి చేసుకున్నందుకు నేను బాధ పడలేదని ఆమె పేర్కొన్నారు. చిన్నతనం నుంచి మా అమ్మ మాట వినడం నాకు అలవాటు అని ఆమె చెప్పుకొచ్చారు.
శిల్పా శిరోద్కర్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు రాజమౌళి కాంబో మూవీ బడ్జెట్ 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు. మహేష్ జక్కన్న కాంబో మూవీలో నటించే ఇతర నటీనటులు ఎవరనే ప్రశ్నకు సంబంధించి జవాబు దొరకాల్సి ఉంది. మహేష్ బాబు ఈ సినిమాతో పాన్ వరల్డ్ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకోవడం పక్కా అని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.