సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన స్థాయికి చేరుకోవాలి అని అనేక మంది అనుకుంటూ ఉంటారు. అలా అనుకునే వారిలో కొంత మంది కి మాత్రమే ఎలాంటి ఆటు పోట్లు లేకుండా అవకాశాలు రావడం , అలాగే వారు నటించిన సినిమాలు కూడా చాలా వరకు మంచి విజయాలు సాధించడంతో చాలా ఈజీగా స్టార్ హీరోయిన్ స్టేటస్ కి చేరుకుంటూ ఉంటారు. కానీ మరి కొంత మంది కెరియర్ మాత్రం అనేక ఎత్తుపల్లాలతో సాగుతూ ఉంటుంది. అలా అనేక ఎత్తు పల్లాలతో కెరీర్ ను సాగిస్తున్న యువ నటీమణులలో నబా నటేష్ ఒకరు.

ఈ ముద్దు గుమ్మ నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా ద్వారా ఈమెకు గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత ఈ బ్యూటీ రవితేజ హీరోగా రూపొందిన డిస్కో రాజా సినిమాలో హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ తర్వాత ఈమె ఈస్మార్ట్ శంకర్ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఈ బ్యూటీ కి క్రేజీ సినిమాల్లో అవకాశాలు రావడం కూడా మొదలైంది. 

దానితో ఈమె చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ కి చేరుకుంటుంది అని కూడా కొంత మంది భావించారు. అలాంటి సమయం లోనే ఈమెకు ఓ యాక్సిడెంట్ జరిగింది. దానితో ఈమె కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండవలసి వచ్చింది. ఇక చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దు గుమ్మ మళ్ళీ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. కొంత కాలం క్రితమే ప్రియదర్శి హీరోగా రూపొందిన డార్లింగ్ సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభూ సినిమాలో ఈ నటి హీరోయిన్గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: