- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సంక్రాంతి కి వచ్చిన గేమ్ చేంజర్ సినిమాతో మరోసారి తన కెరీర్ లోనే భారీ బిగ్గెస్ట్ డిజాస్టర్ ను అందుకున్నాడు .. ఈ సినిమా తో రామ్ చరణ్ పాన్ ఇండియా ఆశలన్నీ గల్లంతయ్యాయి .. ఇక ఇప్పుడు ఎలాగైనా మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర తానేంటో ప్రూవ్ చేసుకోవాలని చరణ్ గట్టి కసిగా ఉన్నాడు .. అందుకే తన 16 వ సినిమా బుచ్చిబాబు సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు .. ఈ సినిమా తో ఎలా అయినా పాన్ ఇండియా బాక్సాఫీస్ పై తన స‌త్తా చూపిస్తానని రామ్ చరణ్ గట్టి నమ్మకం తో ఉన్నాడు . ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ చాలా వరకు పూర్తి చేశాడు బుచ్చిబాబు .


అయితే ఈ సినిమా రిలీజ్ కూడా ఈ సంవత్సరం లోనే ఉంటుందని ఇప్పటికే పలు రూమర్లు వస్తున్న విషయం తెలిసిందే . అయితే ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్‌ లాక్ చేసినట్టు తెలుస్తుంది . దీంతో ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ 16 న థియేటర్స్ లో సందడి చేసేందుకు రాబోతుంది అన్నట్టు తెలుస్తుంది . ఇక మరి దీనిపై అధికార ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది . ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు . అలాగే ఈ సినిమాను వృద్ధి సినిమాస్ మరియు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకం గా నిర్మిస్తున్నాయి . ఈ సినిమాకు బుచ్చు బాబు తో పాటు ఆయన గురువు సుకుమార్ కూడా వర్క్ చేయబోతున్నాడు . అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంట జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది .. ఈ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర భారీ   హీట్ అందుకుంటారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: