టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో నందమూరి నట సింహం బాలకృష్ణ ఒకరు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ స్టార్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం బాలకృష్ణ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. వీరి కాంబోలో ఇదే మొట్ట మొదటి సినిమా. ఇకపోతే ఈ సినిమాలో బాలకృష్ణ , కాజల్ జంటకు మంచి ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి వచ్చాయి. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే భగవంత్ కేసరి సినిమా కంటే ముందు బాలకృష్ణ , కాజల్ కాంబోలో ఓ సినిమా ఆల్మోస్ట్ ఓకే అయ్యి ఆ తర్వాత క్యాన్సల్ అయ్యిందట. ఆ సినిమా ఏది ..? ఎందుకు క్యాన్సల్ అయింది అనే వివరాలను తెలుసుకుందాం.

నందమూరి నట సింహం బాలకృష్ణ కొన్ని సంవత్సరాల క్రితం పైసా వసూల్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. శ్రేయ ఈ సినిమాలో బాలకృష్ణ కు జోడిగా నటించగా ... డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాలో పూరి జగన్నాథ్ మొదట బాలకృష్ణ కు జోడిగా కాజల్ అగర్వాల్ ను తీసుకుందాం అనుకున్నాడట. అందులో భాగంగా కాజల్ తో సంప్రదింపులు కూడా జరిపాడట. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కాంబోలో మూవీ సెట్ కాలేదట. దానితో బాలకృష్ణ కు జోడిగా ఈ మూవీ లో శ్రీయ ను పూరి జగన్నాథ్ హీరోయిన్ గా ఎంపిక చేశాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: